Jump to content

పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23


మ.

శిన యుష్మత్కరుణాకటాక్షకలితశ్రీమత్ప్రసాదాప్తస
త్కవితావైభవజాత మీశతక మేధన్యుండు తా వ్రాసినం
జెవులార న్వినినన్ బఠించినను వాసిన్ గోరికల్ గాంచి మిం
చి విముక్తిన్ గనువాఁడు నీస్థిరకృపన్ శ్రీ...

100


మ.

తతకీర్తిస్తుత కూచిమంచివిలసద్వంశాభిజాతుండు శో
భితశీలుండను సోమసుందరవరాభిఖ్యుండ నీపేర నీ
శతకం బే రచియించి పూసరముగా సద్భక్తి నీకున్ సమ
ర్పితము న్జేసితి దీని గైకొను దయన్ శ్రీకొప్పులింగేశ్వరా.

101


కొప్పులింగేశ్వరశతకము
సంపూర్ణము.

విద్యావినోదినీ ప్రెస్ రామచంద్రపురం