Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కృష్ణమూర్తి తత్వం

అయితే యిది ఏదో ఒక వుపాయంతో ఆలోచనను ప్రభావితం చేయడం ద్వారా కాని, మంత్రాలు పునశ్చరణ చేయడం ద్వారా కానీ జరగదు. ఇవన్నీ పరిపక్వత లేకపోవడం వల్ల చేసే పనులు. ఆలోచన యొక్క సమస్తమైన కదలికలు అంటే మీరే- అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అప్పుడు మెదడులోని కణాలు అపూర్వమైన తీరులో ప్రశాంతమై పోతాయి; బాహ్య ప్రపంచంలో నుండి వచ్చే స్పందనలకు ప్రతిస్పందిస్తాయి తప్ప మరే యితర కదలికా వుండదు.

కాబట్టి, మెదడే నెమ్మదిగా వుండిపోవడం వలన మనసు సమస్తం సంపూర్ణ నిశ్శబ్దతను పొందుతుంది. అయితే యీ నిశ్శబ్దం ఒక సజీవమైన విషయం. ఇది ఒక గురువు ద్వారాగాని, పుస్తకం ద్వారాగాని, ఒక ఆశ్రమం ద్వారాగాని, నాయకుని ద్వారాగాని, ఒక ఆధిపత్యం వల్లగాని, ఒక మాదక ద్రవ్యం వల్లగాని కలిగిన ఫలితం కాదు. ఒక మాదక ద్రవ్యంగాని, ఒక రసాయనిక మత్తుమందు గాని తీసుకొని, మీ మనసును మీరు నెమ్మది పరచవచ్చు, లేదూ మిమ్మల్ని మీరే సమ్మోహపరచుకొనే పద్ధతి ద్వారా కూడా నెమ్మది సాధించవచ్చు. అయితే అది మనసు తనలోకి తాను గాఢంగా చూసుకోవడం వలన కలిగిన సజీవమైన నిశ్చలత్వం కాదు. ఇటువంటి నిశ్చలత్వం వల్ల మాత్రమే మనసు అత్యంతమైన సావధానత్వాన్ని, అత్యున్నతమైన సున్నితత్వాన్ని పొందుతుంది. అటువంటి మనసు మాత్రమే ప్రేమ అంటే ఏమిటో అవగాహన చేసుకోగలుగుతుంది. ప్రేమ అంటే కోరిక కాదు, సుఖం కాదు. మనకి వున్నవల్లా కోరికా, సుఖ సంతోషాలూ, దీన్నే మనం ప్రేమ అని అంటారు. 'నేను నా భార్యని ప్రేమిస్తాను', 'మా దేవుణ్ణి నేను ప్రేమిస్తాను' మొదలైనవి అంటూ వుంటాం. దీనంతటికీ వెనకాల వున్నది భయం, సుఖం, యింద్రియానుభూతి.

కాబట్టి, యిదంతా అర్ధం చేసుకొని, నిజంగా పరిశీలించినవారు, ముందుగా తమ లోపల క్రమతను తీసుకొనిరాగలుగుతారు. తన లోపల కనుక క్రమత వుంటే ప్రపంచంలో కూడా క్రమత వుంటుంది. మీలో ప్రతీ ఒక్కరూ కనుక నిజంగానే మీ లోపల క్రమశీలత్వాన్ని తీసుకొని రాగల్గుతే, ఒక సక్రమ జీవనం, ఒక నూతన సమాజం, ఒక నవ్య జీవితం మీకు సిద్ధిస్తుంది. అయితే అది చేయాలంటే పాత జీవితవిధానాలను మీరు నిర్మూలించాలి. పాత జీవిత విధానాలను పరిహరించడం మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. ఆ అవగాహనలోనే ప్రేమ వుత్పన్నమవుతుంది.

చూడండి, మనిషి అంతులేకుండా ప్రేమను గురించి మాట్లాడుతునే వున్నాడు; ఇరుగు పొరుగును ప్రేమించు, దైవాన్ని ప్రేమించు, దయగా వుండు. అయితే ప్రస్తుతం