32
కృష్ణమూర్తి తత్వం
స్వీయాన్ని సమస్తమూ పరిత్యజించడం ద్వారా మాత్రమే కలిగే అమాయక శీలత ఎక్కడ వుంటుందో అక్కడ ప్రేమ వుంటుంది. ప్రేమ లేనప్పుడు, అమాయక శీలత లేనప్పుడు జీవితమే వుండదు, చిత్రహింస మాత్రం వుంటుంది, సంఘర్షణ మాత్రమే వుంటుంది. అమాయకత్వమూ, ప్రేమ వున్నప్పుడు పూర్తిగా భిన్నమైన ఒక కొత్త స్థితి అక్కడ వుంటుందని మీరు తెలుసుకుంటారు. దీనిని గురించి మరొకరు ఎవరూ మీకు చెప్పలేరు. ఎవరయినా చెప్పినా అది నిజం కాదు. తమకు తెలుసును అనేవారికీ- నిజంగా ఏమీ తెలియదు. అయితే, యిది అవగాహన చేసుకున్న వ్యక్తి చల్లగా, చాపకింద నీరులాగా, అజ్ఞాతంగా పూర్తిగా విభిన్నమైన మరో ఆయతన స్థితిలో అడుగు పెడతాడు ఆది పరిశీలకుడు, పరిశీలితము అన్న పాటి మధ్యన వున్న ఎడాన్ని తొలగించడం వంటిది. ఆ స్థితి పరిశీలకుడు, పరిశీలితము వేరువేరుగా వుండే స్థితి కాదు, దానికి పూర్తిగా భిన్నమైనది.
ది కలెక్టెడ్ వర్క్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,
రెండవ ప్రసంగం, బొంబాయి, 22 ఫిబ్రవరి, 1967
తనని తాను తెలుసుకోవడం లేకుండా ధ్యానం వుండదు
మనం క్రిందటిసారి యిక్కడ కలుసుకున్నప్పుడు సంపూర్ణమైన విప్లవం ఒకటి-అంతర్గతమైనదీ, బాహ్యమైనదీ కూడా అయిన ఒక విప్లవం- రావలసిన అవసరం గురించి మాట్లాడుకున్నాం. ప్రపంచంలో శాంతి వుండాలంటే క్రమత- బయటవుండే క్రమతే కాకుండా, అంతకంటే ముఖ్యంగా అంతర్గతంగా క్రమత- ఆవశ్యకమని మేము చెప్పాము. ఈ క్రమత అంటే రోజూ వరుసగా ఒకటే పనులు చేయడం వంటిది. కాదు. క్రమత సజీవమైనది; కేవలం మేధతోను, సిద్ధాంతాలతోను, ప్రవర్తనను రకరకాల నిర్బంధాలకు లోను చేయడం ద్వారాను క్రమతను తీసుకొనిపోవడం సాధ్యంకాదు. పాతదే అయిన ఆలోచన, గతంలో అది ఏర్పరుచుకున్న నమూనాలో తప్ప పనిచేయలేదని కూడా మేము చెప్పాము. ఆలోచన ఎప్పుడూ పాతదే అయివుంటుంది. క్రమతను తీసుకొని రావడం ఆలోచనవల్ల సాధ్యంకాదు, ఎందుకంటే మేము యిప్పుడే చెప్పినట్లుగా క్రమత సజీవమైనది. పైగా యీ ప్రపంచంలో క్రమరాహిత్యాన్ని తీసుకొచ్చిందే ఆలోచన, అదంతా మనం చాలావరకు వివరంగా మాట్లాడుకున్నామనే అనుకుంటున్నాను. క్రమత అంటే ఏమిటి అని కాకుండా క్రమరాహిత్యాన్ని కలిగించేది ఏమిటో మనం