ప్రసంగాలు
29
జన్మనిచ్చినది ఎవరయినా అయుండచ్చు, ప్రాచీనకాలం నాటి ఒక బోధకుడో, ఒక రచయితో, ఒక కవో, ఒక నవలా రచయితో- గొప్ప తత్వ సిద్ధాంతాలు చేసిన మత ప్రవక్త అని మీరు అనుకున్నా అనుకోవచ్చు. ఆత్మ అనే యీ భావనని, శాశ్వతమైన సత్వం అనే ఒకదానిని, తన ఆలోచన ద్వారా అతను సృష్టించాడు. మనం ఆ ఆలోచనను పట్టుకొని దాని వెనకాల వెళుతూ వుంటాం, ఆ నిబద్దతలో చిక్కుకుని పోతాం. కమ్యునిస్టులు కూడా యింతే- అయితే శాశ్వతమైనది ఒకటే వున్నదనీ వాళ్ళు నమ్మరు. వాళ్ళకు ఏదో బోధించారు, దాని ప్రకారం వాళ్ళు ఆలోచిస్తుంటారు. శాశ్వతమైనది ఒకటి వున్నదనే నమ్మకాన్ని మీకు బోధించినట్లుగానే, శాశ్వతంగా వుండేది ఏదీ లేదు అనే నమ్మకాన్ని వారికి బోధించారు. వారు మీరూ అంతా సమానులే. ఒకరికి నమ్మకం వుంది, ఒకరికి నమ్మకం లేదు. నమ్మకం అనేది మిమ్మల్నీ, వారినీ అందర్నీ నిబద్ధుల్ని చేసింది.
సరే, మరొక వివాదం కూడా దీనికి సంబంధించినది వుంది. అది ఏమిటంటే ఆలోచన ఎప్పటికీ కొనసాగుతూ వుంటుందా అని. ఆలోచనకు మీరు బలం చేకూరుస్తూవుంటే అది కొనసాగుతుంది. అంటే మీరు ప్రతీ రోజూ మిమ్మల్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ దేశాన్ని గురించి, మీ కార్యకలాపాల గురించి, మీరు వుద్యోగం చేయడం గురించి, పని చేయడం, ఆలోచించడం, పనిచేయడం, ఆలోచించడం యిదంతా చేస్తుండటంవల్ల ఒక కేంద్రస్థానాన్ని తయారు చేస్తారు; అందులో వున్నది ఆలోచనల రూపంలో వున్న జ్ఞాపకాల మూట, ఇక, ఆలోచన తనకు తానుగా కొనసాగుతూ వుంటుందా అనే విషయం విచారణ చేసి తీరాలి. ప్రస్తుతం సమయం తక్కువగా వున్నది కాబట్టి అందులోకి మనం పోవద్దు.
మరణం అంటే మనకు తెలియనిది. స్వచ్ఛత్వం అనే అమాయకత్వంతో దాన్ని చూద్దామా? అర్థమయిందా మీకు? ఆ ఆకులమధ్యనుండి ప్రసరిస్తున్న చంద్రుడి కాంతిని యిదే ప్రప్రధమంగా చూస్తున్నట్లుగా చూడగలనా? ఆ కాకులు చేస్తున్న ధ్వనిని యిదే మొట్టమొదటిసారిగా వింటున్నట్లుగా వినగలనో, నాకు తెలిసిన దంతా వదిలివేసేసి పూర్తిగా అమాయకంగా? అంటే ఏమిటంటే, నిన్న అనబడే, నాకు తెలిసిన వాటికి అన్నింటికీ చనిపోవడం, నిన్నటి స్మృతిని మోసుకొని రాకుండా వుండటమే చనిపోవడం అంటే. మీరు అది యదార్ధంగానే చేయాలి. దానిని గురించి అంతులేకుండా సూత్రీకరిస్తూ వుండటం కాదు. ఇందులోని ప్రాధాన్యాన్ని గ్రహించినప్పుడు మీరు తప్పకుండా చేస్తారు. దీనికి ఒక పద్ధతి అన్నది లేదని, ఒక విధానం అనేది లేదని కూడా మీరు గ్రహిస్తారు. ఎందుకంటే ప్రమాదకరమయినదీ ఏదయినా చూసినప్పుడు, వెంటనే ఆ క్షణంలోనే మీరు చర్య చేస్తారు. అదే విధంగా,