28
కృష్ణమూర్తి తత్వం
ఇదంతా మీకు అర్ధం అవుతున్నదో లేదో నాకు తెలియదు. ఒక చిన్న పిల్లవాడికి, నీవు హిందువు అని మీరు నేర్పిస్తారు; నీవు నల్లగా వున్నావు అనీ, నీ రంగు యిదీ అనీ, మరొకరికి నీవు క్రైస్తవుడివి అనీ నేర్పిస్తారు. ఇటువంటివన్నీ మీరు నేర్పిస్తారు; నేర్పించి, ఆ విధంగా అతన్ని అదుపు ఆజ్ఞల్లో పెట్టి నిబద్ధీకృతుడిని చేస్తారు. ఇప్పుడు మేము అంటున్నదేమిటంటే యీ నిబద్ధీకరణాన్ని బ్రద్దలు చేయాలంటే, నేను హిందువును అనే, నేను ముస్లింను అనే, కమ్యునిస్టును అనే, క్రైస్తవుడిని అనే దృష్టితో ఆలోచించకుండా, విషయాలను యదార్థంలో ఎట్లా వున్నాయో అట్లా చూసే ఒక మనిషిని అనే వైఖరితో ఆలోచించడం అవసరం. అంటే నిజమైన అర్ధం, వాటి విషయంలో చనిపోవడం.
మీకు తెలుసు, మనలో చాలామందికి మరణం అంటే ఒక భయానకమైన విషయం. చిన్నా, పెద్దా, వృద్ధులూ రకరకాల కారణాల వల్ల మరణం అంటే, అంతా ఒకటే తీరుగా భయపడతారు. మనం యిట్లా భయపడుతూ వుంటాం కాబట్టి అనేక రకాల సిద్దాంతాలు కని పెట్టాం- పునర్జన్మ, పునరుజ్జీవనం- మరణం వున్నది అనే అసలు వాస్తవాన్నుండి పారిపోవడానికి ఎన్నో రకరకాల దారులు. మరణం అజ్ఞేయమైనది (తెలియరానిది). మీ భర్తని గురించో, భార్యని గురించో మీ వద్ద వున్న కాల్పనిక రూపం తప్ప అతన్ని గురించి కానీ, ఆమెని గురించి కానీ మీకు తెలియదు. అదే విధంగా మరణం గురించి కూడా నిజంగా మీకు ఏమీ తెలియదు. ఇది అవగాహన అయిందా? మరణం అనగానే అదేదో తెలియనిది, అదేదో భయంకరమైనదీ. మీరు అనబడే ఒక జీవి పూర్తిగా నిబద్దీకరణం చెంది వున్నాడు. అతనిలో వున్నదంతా ఆతని ఆందోళనలు, అతని అపరాధభావం, ఆతని క్షోభ, ఆతని బాధలు, అతిస్వల్పమైన ఆతని సృజనాత్మక శక్తి, అవీ యివీ చేయడంలో అతని ప్రతిభ అతను అంటే యిదంతా. తనలోని వన్నీ ఖండిస్తూ, అణచివేస్తూ వుండటమే అతని ఆలోచనల తత్వం. కాబట్టి, తనకు తెలిసినవన్నీ పోగొట్టుకుంటానేమోనని అతను భయపడుతుంటాడు. ఆలోచించడం అనేది లేనట్లయితే, 'నా' వుండదు; భయం అనేదీ వుండదు. కాబట్టి తెలియని దానిని గురించి యీ భయాన్ని సృష్టించినది ఆలోచనలు.
మరణంలో రెండు విషయాలు కలిసిపోయి వుంటాయి. భౌతికమైన ముగింపుతో పాటుగా మానసిక సంబంధమైన ముగింపు కూడా వుంది. అందుకని మనిషి ఏమంటాడంటే ఆత్మ అనేది ఒకటి వున్నది, అది ఎప్పటికీ కొనసాగుతుంది; శాశ్వతంగా వుండిపోయేది ఒకటి వున్నది. నాలోనూ, నీలోనూ; అది ఎప్పటికీ వుంటుందీ అని. ఇప్పుడు, యీ శాశ్వత స్థితిని సృష్టించినది ఆలోచనలు; ఇటువంటి ఆలోచనకు