పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
కృష్ణమూర్తి తత్వం
 

మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవాలి. యదార్థంగా మీరు ఏమిటి అన్నది మీ అంతట మీరే పరిశీలించుకోవాలి. అప్పుడు, ఆ తేటపడిన దానిలో నుండి క్రియ ఆవిర్భవిస్తుంది. అప్పుడు పునరుక్తి చేయడం కానటువంటిది, లొంగిపోయివుండటం కానిది, అనుకరించడం కానిది అయిన ఒక నవ్యమైన జీవనమార్గాన్ని మీ అంతట మీరే కని పెడతారు. అదే నిజమైన స్వేచ్ఛగల జీవితం. అందువల్లనే ఆ జీవితం ఆలోచన అంతటికీ ఆవలగా వుండే ఒకదానికి తలుపులు తెరిచి వుంచుతుంది.

ది కలెక్టెడ్ వర్క్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,

మొదటి ప్రసంగం, బొంబాయి, 1967


స్వేచ్ఛ, బాంధవ్యాలు, మరణం

క్రిందటిసారి మనం యిక్కడ కలుసుకొని ప్రస్తావించుకొన్న విషయాలను గురించి, మీకు అభ్యంతరం లేకపోతే మరికొంత వివరంగా యిప్పుడు మాట్లాడు కుందాం, సమూలమైన విప్లవం రావలసిన ఆవశ్యకత వున్నదని అన్నాము; కేవలం ఆర్థిక రంగంలో కాని, కేవలం సామాజికమైనది కాని కాదు, ఇంకా గాఢమైన లోతుల్లో, చేతనావర్తపు మూలంలోనే విప్లవం రావాలి. ప్రపంచపు స్థితిగతులు యీ విప్లవం జరిగితీరాలని ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాకుండా, ప్రపంచమంతటా సాంకేతిక రంగంలో కాదు- మతపరమైన దృష్టితో చూసినప్పుడు, క్రమక్రమంగా క్షీణస్థితి దాపురిస్తున్నదని కూడా అన్నాము. ఈ 'మతం' అనే మాటను అత్యంత జాగరూకత తోనూ, ఎంతో సందేహిస్తూనూ వాడుతున్నాను. ఎందుకంటే 'మతం' అనే మాటను పూర్తిగా దుర్వినియోగం చేసేశారు. మేధావులు దీనిని మొత్తంగా తృణీకరిస్తారు, తిరస్కరిస్తారు, ఆ మాట వింటేనే వాళ్ళు దూరంగా పారిపోతారు; వైజ్ఞానికులు, మేధావులే కాక మానవతా వాదులు కూడా ఆ మాటతో- ఆ మనోభావంతో, మతం అని అందరూ పిలుస్తున్న, ఆ వ్యవస్థీకరించబడిన నమ్మకాలతో తమకేమీ సంబంధం లేదంటారు. అయితే, మనం యిక్కడ మాట్లాడుతున్నది లక్షల సంవత్సరాల కాలగమనంలో అనేకమైన ఆనుభవాల ద్వారా, అనేకరకాల స్థితిగతుల ద్వారా నిర్మించుకున్న మన మనోతత్వపు స్వభావం లోనూ, మన చేతనావర్తపు స్వరూపంలోనూ రావలసిన విప్లవం గురించి. ఇప్పుడు మనం యిట్లా ప్రశ్నించుకుంటున్నాం. ఈ ప్రపంచంలో- క్రూరంగా, హింసాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా వుండే యీ ప్రపంచంలో, రోజురోజుకీ ప్రయోజకత్వానికే