పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

19

ప్రాధాన్యత పెరిగిపోతూ, ఆ విధంగా యింకా యింకా నిర్ణయాత్మకంగా తయారవుతున్న యీ ప్రపంచంలో- ఒక విప్లవాన్నీ, బాహ్యమైన సామాజిక బాంధవ్యాలలోనే కాకుండా, అంతకంటే అదనంగా ఆంతరీకమైన జీవితంలో కూడా తీసుకొనిరావడం సాధ్యమేనా అని. చేతనావర్తం సమస్తంలోనూ- అంటే ఆలోచనాపరిధి అంతటిలోనూ ఒక సమూలమైన విప్లవం కనుక రాకపోయినట్లయితే మనిషి క్షీణస్థితికి దిగజారి పోయి, హింస, దుఃఖం శాశ్వతంగా వుండి పోతాయి. అంతేకాకుండా, యింకా యాంత్రికంగా, యింకా సుఖాలకు నిలయంగా వుండే సమాజాన్ని తయారు చేసుకొని, చాలా చాలా కృత్రిమమైన జీవితం సాగిస్తాడు. వాస్తవంగా జరుగుతున్నది అదే అని మనం పరిశీలించి చూస్తే తెలుస్తుంది.

యంత్రాల సహాయంతో పనులు చేయించుకోవడం, సైబర్నటిక్స్ (కంప్యూటర్ల సంబంధితశాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడం, ఎలక్ట్రానిక్ మెదడు మొదలైన వాటి వలన మానవుడికి తీరిక సమయం రోజు రోజుకూ ఎక్కువవుతున్నది. ఈ తీరిక సమయాన్ని అతడు వినోద కార్యక్రమాలతో గడపదల్చుకుంటాడు- అవి ఆధ్యాత్మికమైన కాలక్షేపాలు అవచ్చు, అతనికి రకరకాలైన వినోదాన్ని కలిగించేవి కావచ్చు; మనిషికీ మనిషికీ మధ్యన గల బాంధవ్యాలను ఒకరినొకరు ధ్వంసం చేసుకొనడానికి వుపయోగించుకోవడం ఎక్కువవచ్చు కూడా యీ తీరిక సమయాల వల్ల. మనిషి అంతర్ముఖుడవడానికి కూడా యీ తీరికను వినియోగించుకోవచ్చు. కాబట్టి, యీ మూడు రకాలుగా సంభవించడానికి మాత్రమే అవకాశం వుంది. సాంకేతిక విజ్ఞానపరంగా చూస్తే మానవుడు చంద్రమండలంలో అడుగు పెట్టగలడు, అయితే దాని వల్ల మానవజాతికున్న సమస్యలు తీరవు. తన తీరిక సమయాన్ని ఆధ్యాత్మికమైన లేదా మనోల్లాసకరమైన కార్యక్రమాలతో గడిపివేసినంత మాత్రాన కూడా పరిష్కారం అవవు. చర్చికిగాని, దేవాలయానికిగాని వెళ్ళడం, నమ్మకాలు, అంధవిశ్వాసాలు, పవిత్ర గ్రంధాలు పారాయణ చేయడం యివన్నీ ఒక రకంగా కాలక్షేపం కోసం చేసే కార్యక్రమాలే. దానికి బదులు మనిషి తనలోకి తను లోతుగా చూసుకుంటే, శతాబ్దాల తరబడి మనిషి తయారుచేసి పెట్టుకున్న విలువలను ఒక్కొక్క దానినీ ప్రశ్నించి చూసి, యీ మెదడు వుత్పత్తి చేసినది కాకుండా, మరింకేదైనా వున్నదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ప్రపంచమంతటా కూడా కొంతకొంతమంది రకరకాల మాదక ద్రవ్యాలు తీసుకోనీ, సామాజిక జీవనంలో ఏ విధంగానూ పాల్గొనకుండానూ, పాతుకొనిపోయిన వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు.

కాబట్టి మనం మాట్లాడుకుంటున్నది ఏమిటంటే, యిటువంటి ప్రపంచంలో జీవిస్తున్న మనీషి భిన్నమైన మరో సమాజాన్ని, పూర్తిగా విభిన్నమైన మరో క్రమ