పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంభాషణలూ, సంవాదాలు

205


కృష్ణమూర్తి : ఈ తీరం మీద నివసిస్తూ, అవస్థలు పడుతూ అవతలి తీరం గురించి ప్రశ్నలు వేయడంలా వుంది మీరు అడుగుతున్నది. ఆ అవతలి తీరం మీద మీరు వున్నప్పుడు సమస్తం మీరే, ఏమీ లేకపోవడమూ మీరే, ఇటువంటి ప్రశ్నలు మీరు అడగనే అడగరు. ప్రశ్నలన్నీ యీ తీరం మీద వున్నప్పుడే, నిజానికి యీ ప్రశ్నలకు అర్థం లేదు. జీవించడం అరంభించండి. అప్పుడు మీరు కోరుకోకుండానే, ప్రయత్నించకుండానే, నిర్భయంతో అక్కడికి చేరుకుంటారు.

(కన్వర్జేషన్స్)

--- ---