పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంభాషణలూ, సంవాదాలు

197


అధ్యాపకుడు : సర్! గ్రహణేంద్రియాల ద్వారా కలిగే అనుభూతులన్నీ కొంత అవశేషాన్ని, కొంత అలజడిని మిగులుస్తాయి. ఇది రకరకాల సంఘర్షణలకు, అనేక రకాల మానసిక కార్యకలాపాలకు దారితీస్తుంది. అన్ని మతాలలోను సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఏమిటంటే క్రమశిక్షణ ద్వారా, నిరోధించడం ద్వారా యీ యింద్రియాను భూతులను తిరస్కరించడం. కాని మీరు, యీ అనుభూతులను చాలా పదునైన స్పందనశీలత్వంతో గ్రహించాలనీ, అప్పుడే యీ యింద్రియానుభూతులను వక్రీకరించడం గానీ, అవశేషాన్ని మిగుల్చుకోవడం గాని లేకుండా చూస్తామనీ అంటున్నారు.

కృ : అదీ అసలు విషయం. సున్నితత్వమూ, యింద్రియానుభూతులూ ఒకటి కావు. అవి వేరు, యివి వేరు. ఆలోచనలకు, యింద్రియాను భూతులకు, మనోభావాలకు దాస్యం చేసే మనసు అవశేషాలను మిగుల్చుకొనే మనసు. మిగుల్చుకున్న దానిని పట్టుకొని అదీ సంతోషిస్తూ వుంటుంది. ప్రాపంచిక సుఖాలను తలచుకొని తలచుకొని సంతోషిస్తుంది. ప్రతి ఆలోచనా ఒక ముద్రను వదలివెళ్తుంది. అదే మిగిలిపోయిన అవశేషం. మీరు పొందిన ఒక్కొక్క సుఖాన్ని గురించిన ఆలోచన ఒక్కొక్క ముద్రను వదిలి వెళ్తుంది. అవే మన సున్నితత్వాన్ని పోగొడతాయి. ఇవి తప్పకుండా మనసును మొద్దుబారేటట్లు చేస్తాయి. క్రమశిక్షణ, ఆదుపులో పెట్టడం, అణచివేయడం మనసుని యింకా కాస్త మందకొడిగా తయారుచేస్తాయి. నేను చెప్తున్నది ఏమిటంటే సున్నితత్వం అంటే యింద్రియానుభూతి కాదూ అని. సున్నితత్వం అంటే ఏ ముద్రలూ వుండవు, అవశేషం మిగలదు. ఇక ఇప్పుడు సమస్య ఏముంది?

ఆధ్యా : అయితే మీరు చెప్తున్న పరిత్యజించడం వేరూ, యింద్రియాను భూతులను నిరోధించడం అనే పరిత్యాగం వేరూ అనా?

కృ : అదుగో ఆ పూవుల సౌందర్యాన్ని చూసి, వాటి ఎడల సంపూర్ణమైన సున్నితాత్మకతతో వుండి, యిక ఆపైన పోటీని గురించిన ఏ అవశేషమూ, జ్ఞాపకమూ మిగుల్చుకోకుండా వుండాలంటే వాటివైపు ఎట్లా చూడాలి? అంటే ఒక గంట పోయాక వాటివైపు చూసినప్పుడు మళ్ళీ కొత్త పూవులను చూసినట్లుగా వుండాలంటే ఎట్లా చూడాలి! ఒక యింద్రియానుభూతి లాగా, పూవులకు, సుఖానికి సంబంధించిన ఒక యింద్రియానుభూతి లాగా చూస్తే మాత్రం అది సాధ్యపడదు. సాంప్రదాయికమైన పద్దతి ఏమిటంటే సుఖాన్నిచ్చే వాటన్నింటికీ దూరంగా వుండటం. ఎందుకంటే వాటితో సాంగత్యం వల్ల మనలో యింకా యితర రకాలైన సుఖాలు మేలుకుంటాయి. అందుకని అసలు అటు దృష్టి పోకుండా మిమ్మల్ని ఒక క్రమశిక్షణలో వుంచుకుంటారు. ఇటువంటి సాంగత్యాలను శస్త్ర చికిత్స చేసినట్లుగా కోసి పారేస్తే అది పరిణతి