198
కృష్ణమూర్తి తత్వం
అనిపించుకోదు. కాబట్టి అద్భుతమైన యీ రంగులను మనసు, కళ్ళు చూశాక కూడా అవి ఏ ముద్రలను వదలకుండా వుండటం ఎట్లా జరుగుతుంది?
దీనికి ఒక పద్ధతి వుండాలని నేను అనడం లేదు. అటువంటి స్థితి ఎట్లా కలుగుతుంది? లేకపోతే మనలో సున్నితత్వం వుండదు. అంటే ఒక ఫోటోగ్రాఫిక్ కాగితంలాగా చిత్రాల ముద్రలను స్వీకరించడమూ, తనంతట తానే చెరిపేసుకొని తిరిగి శుభ్రంగా అవడమూ. ఫిల్ములాగే వెలుతురు మీద పడగానే ముద్రించుకోవడం, మళ్ళీ వెలుతురు తగిలితే నెగెటివ్గా అయిపోయి కొత్త ముద్రను స్వీకరించడం. కాబట్టి స్వీకరించిన సుఖాలన్నింటినీ తనకు తానే చేరిపేసుకొని నిరంతరంగా శుభ్రం చేసుకుంటూ వుండాలి మనసు. అది సాధ్యమయేదేనా? వాస్తవాలతో కాకుండా కేవలం వట్టి మాటలతో మనం ఆటలాడుకుంటున్నామా?
నాకు స్పష్టంగా కనబడుతున్న సంగతి ఏమిటంటే యింద్రియానుభూతుల, అనుస్పందనల అవశేషాలను మిగుల్చుకుంటే మనసు మందకొడిగా తయారవుతుందీ అని. ఈ యదార్థాన్ని మనం వొప్పుకోము. అనుభవపు మరకలను మిగుల్చుకోకుండా, అత్యంత తీవ్రమైన గాఢత్వంతో ఒక పూవును సంపూర్ణంగా చూడటం అనే అద్భుతమైన సున్నితశీలత్వం అంటే ఏమిటో మనకు తెలియదు. ప్రతి యింద్రియానుభూతీ, ప్రతి మనోభావమూ, ప్రతి ఆలోచనా ఒక మరకను ముద్రిస్తాయనీ, యిటువంటి మరకల మనసు ఒక నవ్యనూతనమైన మనసును మనకు యివ్వలేదనీ, యిది ఒక తిరుగులేని నిజమనీ నేను చూడగలుగుతున్నాను. ఇటువంటి మరకలతో వున్న మనసు వుండటమే మరణం అనీ గ్రహించాను. కాబట్టి నేను మరణాన్ని తిరస్కరిస్తున్నాను. అయితే మరొకటి ఏమున్నదో నాకు తెలియదు. మంచి మనసు అంటే అనుభవాల అవశేషం మిగుల్చుకోకుండా సున్నితంగా వుంటుందని కూడా నేను గ్రహించాను. ఆ మనసు అనుభవాలను పొందుతుంది. అయితే ఆ అనుభవాలు మరకలను ముద్రించడం వుండదు. ఆ మరకల్లో నుంచి మరికొన్ని అనుభవాలను పొందడమూ, కొన్ని అభిప్రాయాలను తయారు చేసుకోవడమూ, ఆ విధంగా యింకా మరణించడమూ వుండదు.
ఒకదానిని నేను త్యజిస్తున్నాను. ఇంకొకటి ఏమున్నదో నాకు తెలియదు. తెలిసినది త్యజించడంలో నుండి తెలియని దానిలోకి అవస్థాంతరం చెందడం ఎట్లా జరగాలి?
ఈ త్యజించడం అనేది ఎట్లా చేస్తాను? తెలిసిన దానిని ఎట్లా త్యజిస్తాను? బ్రహ్మాండమైన నాటకీయ సంఘటనల్లోనా, చిన్న చిన్న సంఘటనల్లోనా? గడ్డం క్షవరం