Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంభాషణలూ, సంవాదాలు

195

కొత్త తరం అనేది వుండనే వుండదు. పాత తరమే యింకో కొత్త రూపంలో పునరావృతం అవుతుంది.

ఒక నవ్యనూతనమైన తరాన్ని తయారుచేయడం సాధ్యమేనని నాకనిస్తున్నది. ఇది నాలో నేనే అనుభూతి చెందడంతో పాటుగా, విద్యార్థికి కూడా దీనిని అందించడం ఎట్లా అని నేను ప్రశ్నించుకుంటున్నాను.

నాలోపల ఏదయినా ప్రయోగత్మకంగా దర్శిస్తున్నప్పుడు విద్యార్టికి ఆ విషయం వ్యక్తీకరించకుండా వుండలేను. ఎందుకంటే యిందులో నేను వేరు అతను వేరు అన్న ప్రశ్నే లేదు. ఇది యిద్దరికీ సంబంధించిన విషయం. అవునా కాదా?

సరే, కలుషితం అవని, నిర్మలమైన మనస్సును తీసుకొని రావడం ఎట్లా? మీరూ, నేనూ యిప్పుడే కొత్తగా పుట్టిన శిశువులం కాదు. సమాజమూ, హిందూమతమూ, మన చదువు, కుటుంబమూ, వార్తా పత్రికలూ అన్నీ మనల్ని కలుషిత పరిచాయి. ఈ కాలుష్యాన్నుంచి బయట పడటం ఎట్లా? ఇదంతా మన అస్తిత్వంలోని భాగమే అని అనుకుంటూ స్వీకరించాలా? సర్, చెప్పండి, ఏం చేయాలి మనం? మన మనస్సులు కలుషితమైపోయాయి అనే సమస్య ఎదురుగా వున్నది. కొంత వయసు పైబడిన వారికి యిందులో నుండి బయట పడటం మరీ కష్టం. మీరు కొంత నయమే, యింకా చిన్న వయసులోనే వున్నారు. సమస్య ఏమిటంటే మనస్సును కాలుష్య రహితంగా చేయడం. ఇది ఎట్లా జరుగుతుంది?

ఇది సాధ్యమైనా అవచ్చు, లేదూ అసాధ్యమూ కావచ్చు. అయితే సాధ్యమా కాదా అనేది కనుక్కోవడం ఎట్లా? తక్షణమే దీనినీ మీరు తేల్చుకోవాలని కోరుతున్నాను.

'పరిత్యాగం' అనే మాటకు అర్ధం ఏమిటో మీకు తెలుసా? గతాన్ని, హిందూత్వాన్ని త్యజించడం అంటే దాని అర్థం ఏమై వుంటుంది? పరిత్యజించడం అనే మాటకు అర్థం ఏమిటసలు? ఎప్పుడయినా, ఏదయినా పరిత్యజించారా మీరు? నిజమైన పరిత్యాగం వుంటుంది, బూటకపు పరిత్యాగం కూడా వుంటుంది. వెనకాల ఒక వుద్దేశ్యం పెట్టుకొని చేసేది బూటకపు పరిత్యాగం. ఒక ఆశయాన్ని సాధించడానికి గాని, ఒక లక్ష్యం మీద దృష్టి పెట్టుకొని గాని, భవిష్యత్తులో ఏదో ఆశించి గాని చేసేది పరిత్యాగం కాదు. ఒకదాన్ని త్యజించడం ద్వారా దాన్ని మించిన దాన్ని లాభంగా పొందాలని చేసేది పరిత్యజించడం కాదు. అయితే ఏ వుద్దేశ్యమూ పెట్టుకోకుండా చేసే పరిత్యాగమూ వుంది. పరిత్యజించాక, యిక ఆ పైన నా భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియనప్పుడు, అది నిజమైన పరిత్యాగం అవుతుంది. నేను హిందువును కాను అనీ, ఏ సంస్థకూ చెందననీ, ఏ ఒక్క ప్రత్యేకమైన మతశాఖకూ