194
కృష్ణమూర్తి తత్వం
ఆంటే ఎరుకలో వుండటం అనమాట - అప్పుడు సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోగలుగుతాం. అప్పుడు విశ్లేషణ అనే ప్రక్రియలో పడి మునిగి పోనక్కరలేదు.
అధ్యాపకుడు : మరో యిబ్బంది కూడా వుంది : సమస్య ఏదీ లేనప్పుడు, శక్తిని కూడగట్టుకోవడం కూడా లేనప్పుడు, ఏదో ఒక రూపంలో ధ్యానం చేస్తూ వుంటాం.
కృష్ణమూర్తి : వల్లించినదే మళ్ళీ మళ్ళీ కేవలం వల్లిస్తూ వుండటం వల్ల, స్మృతులకు ప్రతిస్పందిస్తూ వుండటం వల్ల, అనుభవాలకు ప్రతిస్పందిస్తూండటం వల్ల శక్తి వృధా అవుతుంది. మీ మనసుని కనుక మీరు పరిశీలిస్తూ వుంటే, సుఖాస్పదమైన ఒక జరిగిపోయిన సంఘటన మనసులోకి మళ్ళీ పునరావృతం అవుతూంటుందని గమనిస్తారు. ఆ సంఘటనలోకి మీరు తిరిగి వెళ్ళాలనుకుంటారు. దాన్ని గురించే ఆలోచించాలనుకుంటారు. ఆ విధంగా అది మళ్ళీ ప్రాణం పోసుకొని వేగం పుంజుకుంటుంది. మనసు ఎరుకగా వున్నప్పుడు, ఆలోచనని పూర్తిగా వికసించ నివ్వడం సాధ్యమా? అంటే అర్థం ఏమిటంటే, 'ఇది తప్పు, యిది ఒప్పు' ఆని అనకుండా, ఆ ఆలోచనని పూర్తిగా జీవించ నివ్వడం; ఆ ఆలోచన చక్కగా ఎదిగి తనంతట తానే సమసిపోయే మనోస్థితిని కలిగి వుండటం.
ఒక కొత్తదైన తీరులో సమస్యలతో మనం తలపడదామా? ఒక నవ్యనూతనమైన మానసిక గుణం గల యువతరాన్ని తయారుచేయాలనే విషయం మనం చర్చించుకుంటున్నాం. అది ఎట్లా సాధించగలం? నేనే కనుక యిక్కడి అధ్యాపకుల్లో ఒకరినవుతే యీ విషయంలో నాకు చాలా అక్కర వుంటుంది. ఒక మంచి అధ్యాపకుడి హృదయంలో నిస్సందేహంగా యీ అక్కర వుంటుంది : ఒక కొత్త మనసుని, ఒక కొత్త సున్నితత్వాన్ని తీసుకొని రావడం, చెట్ల ఎడల, మబ్బులు, ఆకాశం, సెలయేళ్ళ ఎడల ఒక కొత్త మనోభావాన్ని కలగజేయడం; పాతచేతననే సరిదిద్ది కొత్త రూపంలోకి తేవడం కాకుండా, ఒక నవ్యనూతనమైన చేతనను తీసుకొని రావడం. నేను చెప్తున్నది గతంచేత ఏమాత్రం కలుషితం అవని, పూర్తిగా నవ్యనూతనమైన ఒక కొత్త మనసు గురించి. నేను అపేక్షించేది కనుక అదే అవుతే యీ విషయంలో నేను చేయవలసినది ఏమిటి? అసలు అటువంటి మనసును తయారుచేయడం సాధ్యమా? గతాన్నే కొనసాగించుకుంటున్న మనసును ఒక కొత్తరూపంలోకి మలచుకోవడం కాదు. గతం స్పర్శతో ఏమాత్రం కలుషితం కాని మనసును తయారుచేయడం. అది నెరవేరే పనేనా? లేక వర్తమానంలోకి చొచ్చుకొని వచ్చే కొనసాగుతూ వుండే యీ గతానికే కాస్త మార్పు చేర్పులు చేసి కొత్త ఆకారం యివ్వడం తప్పు గత్యంతరం లేదా? ఆటు వంటప్పుడు