xxiv
కృష్ణమూర్తి తత్వం
ఘర్షణ మొదలవనేలేదు, ఆ కారణంగా వారిని దూరంగా పంపే యీ ఏర్పాటు చేయడానికి. వలస పాలన జరుగుతున్న ఆ రోజుల ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని యీ అన్నదమ్ములిద్దరి చదువుల కోసం సముచితమైన ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఇంగ్లండులోని గొప్ప విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం సంపాదించడానికి తగినట్లుగా ప్రత్యేక అధ్యాపకుల చేత చదువు చెప్పించాలనుకున్నారు. వారి చెవి తమ్మెలకున్న రంధ్రాలను కుట్టించి పూడ్చేశారు. వాళ్ళ పాదాలకు నొప్పి కలిగినా సరే బూట్లు తొడుక్కోవడం అలవాటు చేశారు; మైదానాల్లో పరుగెత్తే వ్యాయామం చేయించారు; వారి జీర్ణశక్తిని బాధించే గుడ్లు, జావ వంటి వుదయపు అల్పాహారాలు తినిపించారు. కెన్సింగ్టన్ గార్డెన్స్ లో గుర్రపుస్వారీలో శిక్షణ, పడవలు నడపడం, సూర్యాస్తమానం అయ్యేవరకు గ్రీష్మఋతువు సాయంకాలాల్లో 'క్రొకె' అనే బంతి ఆటను పచ్చిక బయళ్ళలో ఆడటం మొదలైనవన్నీ నేర్పించారు. నాటకాలకు, క్రికెట్ పోటీలకు, లండన్ జంతు ప్రదర్శనశాలకూ తిప్పి అన్నీ చూపించారు. సెవైల్ రో అనే ప్రఖ్యాత దర్జీల చేత వారి దుస్తులు అతి నవీనమైన తీరులో తయారు చేయించారు. ఒక ఎర్ల్ గారి భార్య, మరో వైస్రాయిగారి కూతురు వారిని కనిపెట్టివుండి చూసుకునేవారు; సమాజంలోని వున్నత కుటుంబీకులతో పరిచయం కల్పించారు.
కృష్ణమూర్తికి పరిచయం చేసిన ఆ యింగ్లండు సమాజం అప్పుడప్పుడే విక్టోరియన్ జీవితం నుండి బయట పడుతున్నది. రోజు రోజుకీ సంపన్నమవుతూ వుండటం వల్ల సమాజంలోని కట్టడులు సడలి, స్వేచ్ఛా పూరితమూ, ప్రగతి శీలమూ అయి, ఆలోచనా శక్తినీ, మేధనూ పునరుజ్జీవింపచేసే సంస్కృతి నెలకొల్పబడటానికి సాధ్యపడింది. ఒక పక్కన మొదటి ప్రపంచ యుద్ధంలో భయంకరమైన వినాశక శక్తులు పనిచేయడం ఆరంభించినా, మరొక పక్కన 'మానవులు నిజంగానే నాగరికులుగా మారబోయే ఆ చివరి అంచుల్లోకి చేరుకున్నారేమో ననే భావాలు కూడా వాతావరణంలో చోటు చేసుకుంటున్నాయి. స్వతంత్రమైన, హేతుయుక్తమైన, నాగరకమైన, సత్య సౌందర్యాలను అభిలషిస్తున్న' ఒక కొత్త సమాజాన్ని గురించిన ఆశలు కలగడానికి కొంతవరకు సర్వసమానత్వం, అందరకూ న్యాయం అనే సోషలిస్టు. ఆదర్శాల ప్రేరణే కారణం. దీనికి బెర్నార్డు షా, హెచ్.జి.వెల్స్, సిడ్నీ వెబ్, ఓయట్రీస్ వెబ్ మొదలైన ఫేబియన్ సమాజపు సభ్యుల రాజకీయ సంబంధిత రచనలు దోహదం చేశాయి. వీరంతా శ్రీమతి బెసెంటుకు మిత్రులే. తత్వవేత్తలు బెర్ట్రాండ్ రసెల్, జి.యి. మూర్ లు, రచయితలు వర్జీనియా పుల్ఫ్, లియొనార్డ్ వుల్ఫ్ లు, టి.ఎస్. ఇలియట్, ఇఎమ్. ఫోర్ స్టర్ మొదలైనవారంతో పాత విక్టోరియాకాలానికి చెందిన సంప్రదాయాలకు కాలం చెల్లిపోయిందని భావించి, వాటిని వ్యతిరేకించ సాగారు. యూరపులోని మరికొన్ని