పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xxiii

కూడిన కళగా విలసిల్లింది. ఈ రంగంలో లెడ్ బీటర్ అపారమైన ప్రావీణ్యం సంపాదించాడు; అవతార పురుషునిగా కృష్ణమూర్తి అనేది అతని అపూర్వ కళాఖండం.

భారత దేశంలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటపు విశాల రాజకీయ వేదిక మీద పరమోత్సాహంతో కృషిచేస్తున్న శ్రీమతి బెసెంటు బహుళ ప్రజాదరణ పొందిన మహిళ. బెర్నార్డ్ షా, హెచ్.జి. వేల్స్, మహాత్మా గాంధీలతో సన్నిహితంగా మెలగ గలిగిన స్నేహం ఆమెకి వుండేది. దివ్యజ్ఞాన సమాజం ద్వారా వ్యక్తిగతంగా ఏదో లాభం పొందాలని ఆమె అభిలషించలేదు. కృష్ణమూర్తే కాబోయే జగద్గురువు కనుక అవుతే అతనిని సంరక్షించడానికి, అతనిని విద్యావంతుడిని చేయడానికి, ఒక వున్నతమైన గౌరవస్థానంలో అతనిని నిలబెట్టే మేధాపాటవం, మర్యాదా మన్ననా అతనిలో పెంపొందించడానికి ఆమె తన శాయశక్తులా పాటుపడాలనుకుంది. అతని పట్ల గౌరవం చూపుతూ సంరక్షించే అర్హులైన శిష్యులు అతని చుట్టూ సమకూడాలని ఎంతో ఆరాటపడింది. కృష్ణమూర్తి ఆమెతో విభేదించాడు. అయితే శ్రీమతి బెసెంటులోని నిజాయితీని కాని, తన ఎడల ఆమె మనోభావాల్లోని నిర్మలత్వాన్ని కానీ అతడు ఎన్నడూ శంకించలేదు.

లెడ్ బీటరు తను చేస్తున్న కృత్యాలన్నింటికి, దాదాపు ప్రతిదానికీ కూడా, నమ్మశక్యంగా నంత చిన్న వివరాలతో సహా, “పరమ గురువుల ఆదేశాలు" ఆధారమని అధికార యుక్తంగా చెప్పేవాడు. పరమగురువు కుతుమి అధికారపూర్వకంగా తనకు 'చెప్పినట్లు' అందజేసేవాడు.

“వారిని నాగరీకులను చేయాలి; చెమ్చాలు ఫోర్కులు వుపయోగించడం, గోళ్ళకీ, దంతధావ నానికీ బ్రషులు వుపయోగించడం నేర్పించాలి; నేల మీద ముడుచుకొని కూర్చోవడం కాకుండా కుర్చీల మీద హాయిగా కూర్చోవడం, కుక్కల్లాగా ఏదో ఒక మూలన జేరకుండా మనుష్యుల్లాగే మంచాలమీద నిద్రించడం నేర్పాలి "

నాగరకమైన ప్రవర్తన అంటే యూరపియన్ పద్దతులనీ, యింకా అంతకంటే ఆంగ్ల సమాజంలోని వున్నతవర్గాల వారి రీతులు, మర్యాదలు ఆనీ యీ ఆదేశాలు సూచిస్తున్నాయి. ఈ మధ్య జరిపిన అధ్యయనాల వల్ల లెడ్ బీటరు తాను చెప్పుకున్నంత సామాజిక స్థాయికలవాడు కాదనీ సందేహాలు రేకెత్తినా, ఆ కాలంలో ఎంతో మంది భారతీయులు, అమెరికన్లు, రష్యాకు చెందిన వున్నత కుటుంబాలవారు అతని లాగే యీ ఆంగ్ల సమాజపు పైవర్గాన్ని చాలా గొప్పగా పరిగణించేవారు. అందుకే యీ బాలురను యింగ్లండుకు పంపమని శ్రీమతి బెసెంటును లెడ్ బీటరు కొంతకాలంగా అర్ధిస్తూనే వున్నాడు. నిజానికి అప్పటికింకా వాళ్ళు ఎవరి సంరక్షణలో వుండాలి అనే