Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి - వికాసోదయం

XXV

కేంద్రాల్లో కూడా ఒకప్పుడు పరలోక జీవితం గురించి చింతనలో మునిగివున్న శక్తియుక్తులన్నీ యిప్పుడు సామాజిక నిర్మాణాన్ని మార్చివేసే ఆలోచనల వైపుగా దృష్టి సారించాయి.

తరువాత ఒక తొమ్మిది సంవత్సరాల పాటు కృష్ణమూర్తి యూరపులోనే నివసించినా, యీ నవ్య ఆలోచనా ధోరణుల వుద్యమాలలో అతనికి ఆసక్తి కలగలేదు; సమకాలిక కళా, సాహిత్య వుద్యమాలు కూడా అతన్ని ఆకర్షించలేదు. భావోద్వేగ ప్రభావానికి లోనై తిరుగుబాటుదారులుగా తయారైన తక్కిన విద్యార్థులలాగా కాకుండా కృష్ణమూర్తి కేవలం ఒక ప్రేక్షకుడి లాగే వుండి, మొదటి ప్రపంచ యుద్ధంలో జరుగుతున్న రాక్షసకృత్యాలను, రాబోయే రష్యన్ విప్లవపు విపత్తునూ, నానాజాతి సమితి ఆధ్వర్యంలో శాంతి కోసం, మానవులలో రావలసిన శాంతి కాకుండా- శాంతి అనే ఆదర్శాన్ని తేవడం కోసం పడుతున్న అత్యుత్సాహాన్నీ పరికిస్తూ వుండిపోయాడు.

మొదట్లో కృష్ణమూర్తి లోకమంతా అతని అధ్యాపకుల చుట్టూరా తిరుగుతుండేది. వయసులో పెద్దవారూ, శ్రీమతి బెసెంటుకు, లెడ్ బీటరుకు సన్నిహితులూ అయిన సి. జినరాజదాస, జార్జి అరండేలు లిద్దరినీ యీ అధ్యాపకత్వానికి నియమించారు. తమ స్వంత వున్నత విద్యాధ్యయనాన్ని ఆపివేసుకొని, కృష్ణమూర్తిని ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయపు ప్రవేశపరీక్షల్లో వుత్తీర్ణుడిని చేయడం కోసం తయారు చేయమని వారిని ఒప్పించడం జరిగింది. మరికొంత కాలానికి వీరి స్థానంలో వరుసగా యితర అధ్యాపకులూ నియమించబడ్డారు కానీ, ఎంత ప్రయాసపడినా ఒక్కరు కూడా కృష్ణమూర్తికి గణితంలో కాని, సిద్ధాంతాల చరిత్ర పుట్టు పూర్వోత్తరాలలో కాని, రాజకీయ శాస్త్రంలో కానీ ఆసక్తి కలిగించలేక పోయారు. అన్ని ప్రయత్నాలూ వ్యర్ధమై పోయాయి. ఈ యువ విద్యార్థికి పరీక్ష చదువులకి కావలసిన బుర్ర లేనే లేదు. అంతర్గర్భంలో సృజనాత్మకత మరుగుతున్న యూరపు కానీ, ఆ రోజుల్లో మేధావంతులందరినీ కలచి వేస్తున్న సమస్యలు కానీ అతని మీద ఏ ప్రభావమూ చూపలేక పోయాయి. అతని మనస్సులో యివేవీ నాటుకోలేదు. అయితే రకరకాల భాషలు అతన్ని అలరించేవీ, కవిత్వం అంటే మక్కువ చూపేవాడు. ఆక్స్ ఫర్డులో ప్రవేశం తలకు మించినదై పోవడం వల్ల, అతనిని ఫ్రెంచి భాష, సంగీతం నేర్చుకోమని పారిస్ పంపారు.

చక్కని వస్త్రధారణ, నాగరికమైన నడవడితో కృష్ణమూర్తి ఒక నవీన యువకుడిలా చూపరులను ఆకర్షించేవాడు. కొద్దిగా సిగ్గుపడుతూ కనిపించేవాడు. ఏ పని ఒత్తిడి లేనప్పుడు చిన్నపిల్లవాడిలా సరదాగా అల్లరి చేసేవాడు. బయటకు కనబడే యీ ఆకట్టుకునే గుణం వెనకాల మానవాళి దైన్య పరిస్థితిని పరిశీలిస్తున్న ఒక యువకుడు వున్నాడు. అతడు ఎన్నో సందేహాలను వెలిబుచ్చుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. వాటిలో