దినచర్య వృత్తాంతాలు, లేఖరులకు చెప్పి వ్రాయించినవి, ఉత్తరాలు
175
మీదే అనుకుంటే అప్పుడు అనాదిగా వస్తున్నటువంటి, కట్టి బంధించివేసేదైనట్టి యీ శక్తి బారినుంచి మనసును విముక్తం చేయడం ఎట్లా మొదలు పెడతారు? ఎంతో దుఃఖానికి కారణభూతమైన యీ స్వార్ధం బారినుంచి? విద్యార్థి కోపంగా మాట్లాడినప్పుడు గాని, మరొకరిని కొట్టినప్పుడు గానీ, తను చాలా గొప్పవాడిని అని తెలుస్తున్నప్పుడు గాని, వీటి పర్యవసానం ఎట్లా పరిణమిస్తుంది అన్న సంగతిని చాలా శ్రద్ధగా అంటే అందులో ఎంతో ఆత్మీయత పొదిగి చిన్న చిన్న మాటల్లో, సరళమైన భాషలో మీరు వివరించి చెప్పవద్దూ? విద్యార్థి 'యిది నాది' అని మొండికేస్తు న్నప్పుడు, 'నేను చేశాను' అని ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు, భయంవల్ల ఒక పని చేయకుండా తప్పించుకుంటున్నప్పుడు, యిటుక మీద యిటుక పేరుస్తున్నట్లుగా తన చుట్టూ తాను ఒక గోడను నిర్మించుకుంటున్నాడని వివరించి చెప్పడం సాధ్యం కాదా? అతని కోర్కెలు, అతని యింద్రియానుభూతులు, అతనిలోని హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని అణచివేసి తామే ప్రాబల్యం వహిస్తే, అప్పుడు స్వార్థపు నీడ విస్తరిస్తున్నదని అతనికి సూచించడం సాధ్యం కాదా? స్వార్థం, అది ఏ వేషం వేసుకున్నా సరే, అది పున్నప్పుడు ప్రేమ వుండదని విద్యార్థికి చెప్పడం సాధ్యం కాదంటారా?
అయితే విద్యార్థి, 'నిజంగా మీరు యిదంతా గ్రహించారా లేక వూరికే కబుర్లు చెప్తున్నారా?' అని అధ్యాపకుడిని అడగవచ్చు. ఆ ప్రశ్న మీలోని వివేకాన్ని మేల్కొల్పేది అవచ్చు. అప్పుడు మీలో మేలుకొన్న ఆ వివేకమే మీలో సముచితమైన భావాలను కలిగించి, సవ్యమైన సమాధానాన్ని మాటల రూపంలో మీకు అందివ్వవచ్చు.
ఆధ్యాపకుడు అనే పెద్ద హోదా ఏదీ మీకు వుండదు. విద్యార్ధి లాగానే మీరు కూడా అనేక సమస్యలున్న ఒక మనిషి. ఒక హోదాతో మీరు మాట్లాడిన మరుక్షణమే మనుష్యుల మధ్య వుండవలసినే నిజమైన బాంధవ్యాన్ని మీరు హతమార్చేస్తారు. హోదా అనగానే అందులో అధికారం వుంటుంది. అధికారం కోసం ఆరాటపడుతున్నప్పుడు, దానిని గురించిన స్పృహ మీలో వున్నా లేకపోయినా, ఒక నిర్దాక్షిణ్యమైన వైఖరి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మిత్రమా, మీ మీద మహత్తరమైన బాధ్యత వుంది. ప్రేమ అనే యీ సంపూర్ణమైన బాధ్యతను కనుక మీరు తీసుకుంటే, అప్పుడు స్వార్థపు పునాదులనే పెకలించివేసినట్లవుతుంది. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనో, మీచేత యీ పనులు చేయించాలనే వుద్దేశ్యంతోనో యిది చెప్పడం లేదు. అయితే, మనమందరమూ యీ సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనుష్యులమే కాబట్టి, కావాలనుకున్నా వద్దనుకున్నా మన మీద యీ సమస్తమైన, సంపూర్ణ బాధ్యత