Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కృష్ణమూర్తి తత్వం

వీరందరిలోనూ యీ రుగ్మత వున్నది. దేశంలో, రకరకాల సంఘాలతో, గొప్ప గొప్ప లక్ష్యాలతో, సిద్ధాంతాలతో స్వార్ధం తనని తాను పూర్తిగా ఐక్యం చేసుకోవచ్చు. అయినా అది ఆరంభంలో ఎట్లా వుంటుందో, ఎప్పటికీ అట్లాగే వుండిపోతుంది.

విపరీతమైన క్షోభకూ, గందరగోళానికీ కారణమైన యీ కేంద్రాన్ని వదిలించు కోవడం కోసం మానవుడు రకరకాలైన అలవాట్లు, పద్ధతులు, ధ్యాన విధానాలు ప్రయత్నించి చూశాడు. అయితే అది ఒక నీడలాగా చేతికి చిక్కకుండా తప్పించుకుంటూనే వున్నది. అది ఎప్పుడూ అక్కడే వుంటుంది. కానీ, చేతుల్లో నుంచి, మనసులో నుంచి తప్పించుకొనిపోతూ వుంటుంది. పరిస్థితులను బట్టి అది బాగా బలం పుంజుకోవటమో, కొంచెం దుర్బలంగా అవడమో జరుగుతూ వుంటుంది. ఇక్కడ దాన్ని పట్టుకున్నామంటే, అది మరెక్కడో పైకి తేలుతుంది.

ఒక కొత్త తరాన్ని తయారుచేసే బాధ్యత తన మీద వున్న అధ్యాపకుడు యీ స్వార్థం అన్నది మన జీవితాలకు ఎంతగా హాని చేస్తున్నదో, ఎంత కలుషితపరుస్తున్నదో, ఎంత వికృతపరుస్తున్నదో, విపరీతాలను సృష్టించగలదో మాటల్లో కాకుండా, నిజంగా అవగాహన చేసుకున్నాడా అని సందేహం కలుగుతున్నది. దానినుండి ఎట్లా విముక్తి చెందగలమన్నది అతనికి తెలియకపోవచ్చు, కాని అసలు అది వున్నదన్న ఎరుక కూడా అతనికి లేకపోవచ్చు. అయితే, ఒకసారి యీ స్వార్ధం యొక్క కదలికల తీరుతెన్నుల్ని అతడు గ్రహించాక, దానిలోని సూక్ష్మాసూక్ష్మతలను అతడు (లేక ఆమె) విద్యార్థులకు అందించగలరా? ఇది చేయడం అతని బాధ్యత గాదా? స్వార్ధం పనిచేసే తీరు గురించిన ఆంతర్దృష్టి యీ పార్యపుస్తకాల పనంకంటే, పరీక్షలకంటే ముఖ్యమైనది. స్వార్ధం తాను యింకా విస్తరించడానికి, తనలోని దౌర్జన్యానికి, తన లోపల వుండే క్రూరత్వానికి తను సంపాదించిన జ్ఞానాన్ని వుపయోగించుకోగలదు కూడా.

మన జీవితాల్లోని అతి ప్రధానమైన సమస్య యీ స్వార్ధపరత్వం, లొంగిపోయి వుండటం, అనుకరణ అన్నవి స్వార్థం యొక్క లక్షణాలే. అట్లాగే, పోటీ తత్వం, ప్రతిభలో వుండే నిర్దాక్షిణ్యతా కూడా. మన పారశాలల్లోని అధ్యాపకులు యీ సమస్యని గట్టిగా పట్టించుకొని ఆలోచిస్తే కనుక - వాళ్ళు అట్లా చేస్తారనే నేను ఆశిస్తున్నాను అప్పుడు వాళ్ళు విద్యార్ధి స్వార్ధరహితంగా ఉండటానికి ఏవిధంగా అతనికి తోడ్పడాలి? అబ్బో, అది ఏదో దైవప్రసాదంగా రావలిసిందే అనో, అది అసాధ్యమనో మీరు దీన్ని త్రోసిపారేయవచ్చు. అట్లా కాకుండా నిజంగానే మీరు దీన్ని కనుక గాఢంగా పట్టించుకుంటే - మనం పట్టించుకొని తీరాలీ - విద్యార్ధి మొత్తం బాధ్యత అంతా