170
కృష్ణమూర్తి తత్వం
అవడం, పూర్తిగా అయిపోవడం ---- అంతకంటే సరియైన మాట వుందా ----? 'సమాప్తం అవడం’ సరిగ్గా వుంది అనుకుంటాను. అదే మనం తీసుకుందాం. సమాప్తం ఆవడం. అయితే సమాప్తం కావడానికి వెనకాల ఏదయినా ప్రయోజనమూ, వుద్దేశ్యము వున్నట్లవుతే, అది ఒక నిర్ణయం తీసుకోవడం వంటిది గనుక అవుతే, అప్పుడు అది కూడా కేవలం ఒకదానినుంచి మరొకదానికి మార్పు మాత్రమే అవుతుంది. ఇక్కడ నిర్ణయం అనే మాటలో సంకల్పించే చర్య అనే అర్థం కూడా వస్తుంది. 'నేను యిది. చేస్తాను', 'నేను యిదీ చేయను'. సమాప్తం అవడం అనే క్రియలో కోరిక ప్రవేశిస్తే సమాప్తం అవడానికి కోరిక కారణం అవుతుంది. కారణం వున్నప్పుడు లోపల ఒక వుద్దేశ్యమూ వుంటుంది. కాబట్టి అప్పుడది నిజంగా సమాప్తం చెందడం కాదు.
ఇరవయ్యో శతాబ్దంలో చాలా బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. విధ్వంసపూరితమైన రెండు యుద్ధాలే కాకుండా గతి తార్కిక భౌతికవాదం వచ్చింది. మతవిశ్వాసాలను, మతాచారాలను కర్మకాండలను విమర్శించే ధోరణి కూడా మొదలయింది. వీటితోపాటు సాంకేతిక విజ్ఞానరంగం కూడా ఎన్నో లెక్కలేనన్ని మార్పులు తీసుకొని వచ్చింది. కంప్యూటర్లు అభివృద్ధి చెందినకొద్దీ యింకా ఎన్నో మార్పులు జరగనున్నాయి. ఇంకా మీరు ఆరంభదశలోనే వున్నారు. అంతా పూర్తిగా కంప్యూటర్ల అజమాయిషీలోకి వచ్చినప్పుడు మన మానవ మస్తిష్కాలు ఏమయిపోతాయి? అది మళ్ళీ యింకో సమస్య. ఇంకెప్పుడయినా దానిని గురించి పరిశీలిద్దాం.
వినోదకార్యక్రమాలను వుత్పత్తి చేసే పరిశ్రమ ప్రాబల్యం ఎక్కువయినప్పుడు - ప్రస్తుతం మెల్లిమెల్లిగా అదే జరుగుతున్నది . అప్పుడు నిరంతరంగా సుఖం కోసం, సరదాల కోసం, పూహాలోకాల్లో చిత్రించుకున్న యింద్రియాకరణల కోసం యువతీ యువకులు, విద్యార్థులు, చిన్నపిల్లలు ప్రేరేపించబడుతూ వుంటారు. నిగ్రహము, నిరాడంబరత వంటి మాటలను సయితం దూరంగా తీసిపారేస్తారు. ఆ మాటల ముఖం కూడా చూడరు. సన్యాసులు, మునులు అవలంబించే కఠోర నియమనిష్టలు, వారి వైరాగ్యం, కాషాయ వస్త్రాలో, ఏదో ఒక చిన్న అంగవస్త్రమో ధరించడం, యీ విధంగా లౌకిక సుఖాల్ని పరిత్యాగం చేశామనుకోవడం నిరాడంబరత్వం కాదని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అసలు యిటువంటి విషయాలను గురించీ, నిరాడంబరత అంటే ఏమిటి అనేదాన్ని గురించి వినడానికైనా మీరు యిష్టపడరు. చిన్నతనంనుంచీ వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ, మీనుంచి మీరు పారిపోవడానికి మతసంబంధమైనవో, యితరమైనవో కాలక్షేపాలను వెతుక్కుంటూ గడుపుతున్నప్పుడు, మనోతత్వ వైజ్ఞానిక నిపుణులందరూ మీరు లోపల ఏమేమి భావిస్తుంటే అవన్నీ పైకి వ్యక్తం చేసి తీరాలనీ, అట్లా కాకుండా లోపల దాచుకోవడం