పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

155


గతించినదాన్ని ఎట్లా చెరిపివేయాలో తెలుసుకోవడంకంటే, ఆ గతాన్ని చెరిపివేయాలని - మీరు ఎందుకు కోరుకుంటున్నారన్నది ముఖ్యం. ఒక సమస్యని గురించి ఏంచేయాలి అన్నదానికంటే, మీరు వెనకాల ఏ వుద్దేశ్యం పెట్టుకొని ఆ సమస్యను చూస్తున్నారన్నది చాలా ముఖ్యం. ఆ సహవాసం యొక్క జ్ఞాపకాన్ని తుడిచిపారేయాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?

'అప్పటి ఆ రోజులకు చెందిన స్మృతులంటే నాకు బొత్తిగా యిష్టంలేదు. అవి తలచుకుంటేనే నా మనసు చేదెక్కుతున్నది. ఈ కారణం సరిపోదా?'

అంతగా సరిపోదు. సరిపోతుందా? ఆ పాత స్మృతులను చెరిపివేయాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అవి మీ మనసును చేదెక్కిస్తున్నాయనే కారణంగా కానే కాదు. ఒకవేళ మీ పాత జ్ఞాపకాలను ఏదో ఒక విధంగా మీరు చెరిపివేయగలిగినా, మళ్ళీ మీకు అవమానంగా అనిపించే చర్యల్లో మీరు చిక్కుకోవచ్చు. మీకు అసహ్యంగా అనిపించే జ్ఞాపకాలను తుడిచిపారేసినంత మాత్రాన మీ సమస్యకు పరిష్కారం దొరకదు. దొరుకుతుందా?

'దొరుకుతుందని అనుకున్నాను. అయితే యిప్పుడు అసలు సమస్య ఏమిటి? మీరు అనవసరంగా సమస్యను మరీ సంకీర్ణంగా తయారుచేయడంలేదూ? ఆసలే జటిలమైన సమస్య. పోనీ నా జీవితమే జటిలమైనది. దాని మీద యింకా భారాలన్నీ మోపడం ఎందుకు?'

భారం ఎక్కువ చేస్తున్నామా, 'వున్నది' నీ అవగాహన చేసుకొని దానినుంచీ విముక్తి పొందడానికి ప్రయత్నిస్తున్నామా? దయచేసి కొంచెం ఓర్పుతో వినండి. గతాన్ని చేరిపివేయమని మిమ్మల్ని ప్రేరణ చేస్తున్నది ఏమిటి? గతం అసహ్యకరంగా అనిపించవచ్చు. కాని చెరిపివేయాలనీ మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మీ గురించి మీకు ఒక ప్రత్యేకమైన భావన, ఒక కాల్పనిక చిత్రం వున్నది. దానికి యీ స్మృతులు విరుద్ధంగా వున్నాయి. అందుకని ఆ స్మృతులను వద్దు పొమ్మంటున్నారు. మీకు మీరే ఒక ప్రత్యేకమైన విలువను యిచ్చుకున్నారు కదూ?

'అవును మరి, లేకపోతే --------'

రకరకాలైన అంతస్తుల్లో మనల్ని నిలబెట్టుకోవడం మనం అందరమూ చేసే పనే. ఈ ఎత్తు మీదనుంచి మనం కిందపడిపోవడం కూడా జరుగుతూనే వుంటుంది. మనం సిగ్గుపడేది ఈ పడిపోవడం గురించి, ఈ సిగ్గుపడటానికి, యీ పడిపోవడానికి మనకి మనం ఆపాదించుకునే ఘనతే కారణం. అవగాహన చేసుకోవలసింది మనకి మనమే స్వయంగా యిచ్చుకున్న యీ ఘనతని తప్ప పడిపోవడాన్ని కాదు. ఒక