పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కృష్ణమూర్తి తత్వం

పడ్డానని, అతన్ని ఆరాధించానని, అతనికి పూర్తిగా నన్ను నేను సమర్పించుకున్నానని తలచుకుంటేనే ఎంతో ప్రేమ, గొప్ప దయ వున్న ఆదర్శమూర్తి నా భర్త అని అనుకున్నాను. వట్టి మూర్ఖుడూ, వంచకుడూ అని నేను కని పెట్టినప్పుడు అతనంటే అసహ్యం వేసింది. ఒకప్పుడు అతనితో జీవించానన్న తలంపే నేను కలుషితమై పోయాననే భావం కలిగిస్తున్నది. అతని నుంచి నాకు పూర్తిగా స్వేచ్ఛ కావాలి.'

భౌతికంగా మీరు అతని నుంచి విముక్తి పొందవచ్చు. కానీ మీలో అతనంటే ఆగ్రహం వున్నంతవరకు, మీకు స్వేచ్ఛ దొరకదు. అతన్ని మీరు ద్వేషిస్తుంటే, అతనితో మీకు బంధం వున్నట్లే. అతన్ని తలచుకొని మీరు సిగ్గుపడుతుంటే అతనికీ మీరు యింకా దాసులుగా వున్నట్లే, మీ కోపం అతని మీదనా, మీ మీదేనా? అతను ఏమిటో అట్లా అతను వున్నాడు. మీకెందుకు కోపం? అసలు మీ ఆగ్రహం నిజంగా అతనిమీదేనా? 'ఉన్నది'ని చూశాక, దానితో కొంతకాలం సహవాసం చేశానే అని మీరు సిగ్గుపడుతున్నారా? మీలో వున్న ఆగ్రహం నిస్సందేహంగా అతనీమీద కాదు. ఒకప్పుడు మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలమీద, నిర్ణయాలమీద, మీచర్యలమీద. మిమ్మల్ని చూసుకొని మీరే సిగ్గుపడుతున్నారు. ఇది ఒప్పుకోవడం ఇష్టంలేక అతను అట్లా వున్నాడని అతనిమీద దోషం ఆరోపిస్తున్నారు. మీలో వున్న కాల్పనిక ప్రణయ ఆరాధన నుంచి పొరిపోవడానికి అతని మీద ద్వేషం ఒక మార్గం అని మీకు తెలిసివచ్చినప్పుడు, అప్పుడు అతను అనే వ్యక్తి మీ దృష్టిపధం నుంచి అదృశ్యమౌతాడు. మీరు సిగ్గుపడుతున్నదీ అతన్నీ గురించి కాదు, అతనితో సహవాసం చేసిన కారణంగా మీ గురించే. మీ కోపం అంతా మీ మీదే, అతని మీద కాదు.

'అవును, అది నిజమే.'

ఇది మీరు నిజంగా గ్రహిస్తే, దాన్ని ఒక వాస్తవంగా అనుభూతిలోకి తెచ్చుకుంటే, అప్పుడు మీకు అతని నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక ఆ తరువాత మీ శత్రుత్వానికి అతను కారణభూతుడు అవడు. ప్రేమలాగే శత్రుత్వం కూడా ఒక బంధం అవుతుంది.

'కానీ నా అవమానాన్నుంచి, నా అవివేకాన్నుంచి నేను ఎట్లా విముక్తి పొందుతాను? నాకు యిప్పడు అంతా స్పష్టంగా అర్థమవుతున్నది. అతనున్నట్లుగా అతనున్నాడు. అతని దోషం ఏమీ లేదు. కానీ, యీ అవమానాన్నుంచీ, నా లోపల మెల్లమెల్లగా పెరుగుతూ, యీ విషమస్థితిలోకి, పూర్తిగా పరిపక్వదశ చేరుకున్న యీ ద్వేషభావాన్నుంచి, నాకు ఎట్లా విముక్తి కలుగుతుంది జరిగిపోయిన గతాన్ని ఎట్లా చెరిపివేయగలను??