Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

కృష్ణమూర్తి తత్వం

మీరు పనిలో పడటం ద్వారా పారిపోతారు. మరొకరు త్రాగుడులో; మతపరమైన కర్మకాండల్లో యింకొకరు; జ్ఞానం ఆర్జించడంలో కొందరూ, దేవుడి పేరు చెప్పుకొని కొందరూ పారిపోతుంటారు. ఒక్కొక్కళ్ళు వినోదకాలక్షేపాలకు బానిసలవుతారు. అన్ని పలాయనాలు ఒకటే, అందులో గొప్పవీ, అల్పమైనవీ అనే తేడాలు లేవు. మనం ఏమిటో ఆ దానినుంచి పారిపోవడానికి వుపయోగించుకుంటున్నంత కాలం దేవుడూ, త్రాగుడు రెండింటి స్థాయీ ఒకటే. ఈ పలాయనాల గురించిన 'ఎరుక కలిగినప్పుడే, మన నిబద్ధీకరణాన్ని గురించి తెలుసుకోగలుగుతాం.

'సమాజ సేవ ద్వారా పారిపోవడం అనేది నేను ఆపివేశాననుకోండి. ఆ తరువాత నేను ఏంచేయాలి? పలాయనం అన్నది లేకుండా ఏ పనైనా నేను చేయగలనా? నేను చేసే అన్ని పనులూ ఏదో ఒక రూపంలో నానుంచి నేను పారిపోవడమే కాదా?'

ఈ ప్రశ్న కేవలం మాటలతో పేర్చినదో, లేక మీరు నిజంగా అనుభూతి చెందుతున్న ఒక వాస్తవాన్ని వ్యక్తం చేస్తున్నదా? మీరు పారిపోకుండా వుంటే అప్పుడు ఏమవుతుంది? అదెప్పుడయినా ప్రయత్నించారా?

`ఇట్లా నేను అనవచ్చో కూడదో కాని మీరు చెప్పేదంతో వట్టి వ్యతిరేక వాదంగా వుంది. పనికి ప్రత్యామ్నాయంగా యింకొకదానిని మీరు చూపడం లేదు.'

ఈ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం అంతా యింకో రకం పలాయనం కాదూ? ఒక రకం కార్యకలాపాలు సంతృప్తికరంగా లేకపోతేనో, సంఘర్షణను పెంచుతుంటేనో మరోకదానివైపు మళ్ళుతాం. అసలు పలాయనం అనే దానినీ అర్ధం చేసుకోకుండా ఒక పని ఆ పేసి, ఆ స్థానంలో మరో కార్యకలాపాన్ని పెట్టుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. అవునా కాదా? ఈ పలాయనాలు, వాటి మీద మనం పెంచుకున్న మమకార బంధాలే నిబద్ధీకరణాన్ని తయారు చేస్తున్నాయి. నిబద్దీకరణం వల్లనే సమస్యలు, సంఘర్షణ వుత్పన్నమవుతున్నాయి. ఈ నిబద్ధీకరణమే సమస్యలనీ అవగాహన చేసుకోకుండా మనకి అడ్డు తగులుతున్నది. నిబద్ధులమై వుండటంవల్ల మన ప్రతిస్పందనలన్నీ తప్పకుండా సంఘర్షణకు దారితీస్తాయి.

'నిబద్ధీకరణం నుంచి విముక్తి ఎట్లా దొరుకుతుంది?'

అవగాహన చేసుకోవడం వలన; మన పలాయనాల గురించి ఎరుక పొందడం వలన. ఒక మనిషిపైన, ఒక సిద్ధాంతం పైన మమకారం పెంచుకోవడమే నిబద్ధీకరణం పొందడానికి గల కారణం. మనం అర్థం చేసుకోవలసింది అదీ. అంతే తప్ప, యింతకంటే మంచి పలాయనాన్నో, యింతకంటే తెలివిగల పలాయనాన్నో వెతుక్కో