పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

111

వెళ్ళడానికిగాను మీరే ఒక మార్గాన్ని చేసుకొని బయలుదేరుతారు. అటువంటి శాంతి మీ లోపల వున్న కోరికకు మీరు యిచ్చుకున్న రూపమే, అవునా కాదా? అందువల్ల అది అసలైన శాంతి కాదు. అది మీకు కావాలని మీరు కోరుకున్నదీ, మీరు ఏమిటో దానికి సరిగ్గా విరుద్ధమైనదీను. నేను సంఘర్షణల్లో, దారుణమైన బాధల్లో, వైరుధ్యాలలో చిక్కుకొని పోయివున్నాను. దౌర్బాగ్యస్థితిలో వున్నాను, నాలో హింస వుంది. ఏ గొడవలూ నాలో అలజడి కలిగించని ఒక ఆశ్రయం, ఒక స్థితి నాకు కావాలి. అందుకోసం నేను నానారకాల గురువుల వద్దకూ, ఆచార్యుల వద్దకు వెళ్తుంటాను. పుస్తకాలు చదువుతాను, నేను కోరినవి నాకు తప్పకుండా లభిస్తాయనీ భరోసా యిచ్చే క్రమశిక్షణలు పాటిస్తాను. శాంతిని పొందడానికి నన్ను అణచివేసుకుంటాను, నిగ్రహం అవలంబిస్తాను, లొంగిపోయివుంటాను. అదేనా శాంతి అంటే? శాంతి కావాలంటూ దాని వెనకాల పరిగెత్తితే చిక్కేదికాదు శాంతి- అది కలుగుతుంది, అంతే. అదే గమ్యం కాదు, దారిలో అది లభిస్తుంది. నేను - నా అనే మొత్తం ప్రక్రియను, నాలోని వైరుధ్యాలను, నా కోరికలను, ఆకాంక్షలను, నా గర్వాన్ని అవగాహన చేసుకోవడం నేను ఆరంభించినప్పుడు అది కలుగుతుంది. అయితే శాంతే నా గమ్యం అని కనుక నేను అనుకుంటే అప్పడు కదలికలేకుండా మురిగిపోయిన స్థితిలో నేను జీవిస్తుంటాను. శాంతి అంటే అదేనా?

కాబట్టి, ఏదో ఒక విధానం ద్వారానో, ఒక పద్ధతో లేదా ఒక సూత్రబద్ధమైన మార్గం ద్వారానో శాంతిని సంపాదించాలనుకుంటుంటే, ఆ విధంగా శాంతిని సాధించవచ్చు. అయితే ఆ శాంతి లొంగుబాటులో వుండే శాంతి, మరణంలో వుండే శాంతి. కాని మనలో చాలామందికి కావలసినది అదే. తళుక్కుమనే ఒక ప్రకాశం ఏదో చూస్తాను, మాటల్లో పెట్టలేని అనుభవం అది, ఆ స్థితిలోనే ఎప్పటికీ వుండిపోవాలని కోరుకుంటాను, అదే కొనసాగుతూ వుండాలని కోరుకుంటాను. నిర్ద్వందమైన పరమ సత్యం నాకు కావాలి. నిర్ద్వందమైన పరమ సత్యం అనేది ఒకటి వుంటే వుండవచ్చు గాక, మహోన్నతమైన గొప్ప అనుభవాలు వుంటే వుండవచ్చుగాక, కానీ నేను ఏదో ఒక దాన్ని గట్టిగా పట్టుకొని వేళ్ళాడుతూ వుంటే మృత్యువును ఆహ్వానిస్తున్నట్లే కాదూ? శాంతి మరణంలో లేదు. కాబట్టి యీ విధమైన గందరగోళపు స్థితిలో, సంఘర్షణలో వున్నపుడు అసలు శాంతి అంటే ఏమిటి అనేది నేను వూహించను కూడా లేను. నేను వూహించగలిగిందల్లా దానికి వ్యతిరేకమేన దానిని, అంతే. ఇష్పడు నేను వున్న దానికి వ్యతిరేకమైనది. శాంతి కానే కాదు. అందువల్ల యీ పద్దతులన్నీ కూడా యిప్పుడు నేనున్న దానికి వ్యతిరేకమైన దానిని పొందడానికి