Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

89

అనుసరించడం అంటే మీ మనసుని ధ్వంసంచేసుకోవడమే. ఆ గురువు వద్ద వున్నదని మీరు అనుకుంటున్నది ఏదో మీకూ కావాలని అనుకోవడం వల్లనే మీరు అతని వెంటపడుతున్నారు. దిగజారిపోవడానికి యీ విధంగా నాంది పలుకుతున్నారు. లౌకిక విషయాల్లో కాని, ఆధ్యాత్మిక విషయాల్లో కాని గొప్పవాళ్ళం కావాలని ప్రయాస పడటం అధోగతికి పోయే మార్గాల్లో ఒకటి ఎందుకంటే యిటువంటి ప్రయాస వల్ల మిగిలేది ఆందోళనే. దాని ఫలితంగా భయమూ, నిస్పృహ, మానసిక అనారోగ్యం తప్పవు - యివి మళ్ళీ శరీరం మీద తమ ప్రభావాన్ని చూపుతాయి. ఇదంతా మీకు స్పష్టంగా వున్నదని ఆశిస్తాను. మనసుకు చికిత్స చేయడానికి యింకొకరిని ఆశ్రయిస్తున్నారూ అంటే హీనస్థితికి దిగజారడంలో అదీ ఒక అంశమే.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

బొంబాయి, 28 మార్చి, 1956

ప్రశ్న : నా శరీరమూ, మనసూ రెండూ కూడా బాగా లోతుగా పాతుకొని పోయిన వాంఛలతోనూ, సచేతనమైన, అచేతనమైన భయాలతోను తయారు చేయబడ్డాయేమో అనిపిస్తూ వుంటుంది. నా మనసును నేను జాగ్రత్తగా కని పెట్టే వుంటాను. కాని తరచుగా యీ సాధారణ భయాలే నన్ను పూర్తిగా లోబరిచేసుకున్నట్లు అనిపిస్తుంది, నేను ఏం చేయాలి?

కృష్ణమూర్తి : సర్! ముందుగా భయం అంటే ఏమిటో తెలుసుకుందాం. భయం అంటే ఏమిటి? భయం మరొకదాని ఆధారంతోనే నిలబడ గలుగుతుంది. దానికి ఒంటరిగా అస్తిత్వం లేదు. ఏదో ఒకదానికి సంబంధించినదిగా అది వుంటుంది. అంటే- మీరు నా గురించి ఏమంటారో, ప్రజలు నా గురించి ఏమనుకుంటారో, వుద్యోగం పోతుందేమో, వృద్ధాప్యంలో భద్రత ఎట్లా, తల్లిదండ్రులు చనిపోతారేమో- యింకా యిటువంటివి ఎన్ని వున్నాయో దేవుడికే తెలియాలి. భయం అనేది ఏదో ఒక అంశాన్ని గురించి వుంటుంది.

సరే, యీ భయం ఎట్లా తొలిగిపోతుంది? ఒక ప్రత్యేక రకమైన క్రమశిక్షణ ద్వారా భయాన్ని పోగొట్టుకోగలమా? క్రమశిక్షణ అంటే నిరోధించడం; యీ నిరోధాన్ని అభ్యసించడం, అలవరచుకోవడం. దీనివల్ల మనసులో నుండి భయం తొలగి పోతుందా? లేక దాన్ని కొంత దూరంగా నిలబెడుతుందా? మధ్యలో ఒక గోడ కట్టినట్లు; అయితే గోడకు అవతలి వైపున భయం అట్లాగే వుండిపోతుంది. కాబట్టి నిరోధంతో గాని, ధైర్యాన్ని అలవరచుకోవడం ద్వారా గాని భయాన్ని తొలగించలేము. ఎందుకంటే