పుట:కుమారసంభవము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

65

క. మెలఁగక మృగములు విహగము, లులియక లేఁబొఱలఁ జిగుళులొత్తక మలయా
     నిలుఁడు సలింపక నెలవుల, నలవడి వన మమరెఁ జిత్రితాటవివోలెన్.488
వ. అంత మనసిజుండు ద్రినయనాభిముఖుం డగుడును.489
క. మృడుపై ముంగలి సని తల, పడి మలయానిలుఁడు పోరు భరమై మదనుం
     బడలువడఁ బఱచుక్రియఁ దడఁ, బడ ధూళియు గాడ్పు వీచెఁ ప్రతికూలంబై.490
వ. ఇట్లు సద్యోమరణసూచకంబు లగు నపశకునంబులు గని మనంబునం గుసురు
     గొనుచుం జనిచని.491
క. లోఁగుఁ దరమైన పొదరుల, నాఁగిన శకునంబ తలంచు నడుగడుగునకున్
     డాఁగఁ గెల నరయుఁ బ్రాణము, లీఁగుట కొడఁబడక మదనుఁ డెంతయు భీతిన్.492
క. తరుగుల్మాదులమఱువునఁ, దరతరమ చలించి గడికిఁ దారుచుఁ బురసం
     హరు నెయిదఁజొచ్చెఁ గాముఁడు, కరివైరికిఁ జొచ్చు వేఁటకాఁడును బోలెన్.493
వ. ఇట్లెట్టకేనియుం బరమేశ్వరావాసంబు సొత్తెంచి దహనాంబకుదృష్టిఁ దప్పించి
     కెలనం దమలలతావేష్టితాశోకసహకారంబు నోలంబు గొని త్రినయనుం గనుం
     గొని.494
క. స్ఫురదాధారసరోజపీనహృదయాంభోజాతరంధ్రార్పిత
     స్మరణాయత్తసముత్థతోజ్వలతరాత్మజ్యోతిరిద్ధాంగమ
     క్సరసస్ఫాటికహర్మ్యమధ్యకనకస్తంభంబొ నాఁ బర్వున
     త్యురుజూటాకృతి నున్నశంభుదెస వో నుల్కెన్ మనోజుం డెదన్.495
వ. ఇ ట్లున్నపరమేశ్వరుశాంతరూపంబు దనకుం గ్రూరరూపం బైనం గని వనంబు
     జొరనుల్కి యిభంబున కోజవిడి నడ్డంబుసేర్చి సొత్తెంచు హాస్తికోత్తముండునుం
     బోలె మరుండు గౌరిరాకయ వార్చుచు నుండె నంత నిజేశ్వరుక న్నెఱింగి రతి
     మతి ని ట్లని తలంచు.496
క. కామినులు లేక లోకులఁ, గాముని కె ట్లగు మనోవికారులఁ జేయన్
     గామవికారము లేకయుఁ, గామినులకు జనుల నెట్లు గలిపింపనగున్.497
వ. అని కాముకకామినీజనంబు లితరేతరాశ్రయంబుల కా భావించచుండె నంత.498