పుట:కుమారసంభవము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

కుమారసంభవము

పంచమాశ్వాసము

     శ్రీభాషాశ్రితసన్నుత, భాభాసితవిమలవదన పంకరుహుఁ దపః
     శ్రీభామావిభు గుణర, త్నాభరణాధరణు మల్లికార్జునదేవున్.480
చ. అమరఁగ నింద్రియాదివిషయంబులతో విషయంబు లన్నియుం
     గ్రమమున గాడ్పునం దడఁచి గాడ్పులఁ గూర్చి మనంబునందు సం
     యమతిఁ దన్మనం బొనర నాత్మునియం దొడఁగూడ్చి యాత్మయో
     గమునఁ జలింపకున్నశివుఁ గాంచె మనోజుఁడు దవ్వుదవ్వులన్.481
క. హరుఁ గని ప్రాణము ఝల్లని, విరిసిన మెయివఱచి పచ్చవిల్తుఁడు దగఁ జి
     త్తరువున వ్రాసినకాముని, కరణి నచైతన్యవృత్తిఁ గదలక నిల్లెన్.482
వ. ఇట్లు నిలిచి యాక్షణంబ రతిప్రబోధితుండై త్రిణయను సమాధివికల్పంబు సేయ
     నుపక్రి మించి నిజామూలబలంబుల నవలోకించిన.483
మ. అలిఝంకారముఁ గీచకస్వసముఁ గీరాలాపముల్ మత్తకో
     కిలనాదంబులు శారికారవములుం గేకీనినాదంబులుం
     గలయం భోరన మంజుగానములతో గంధర్వగీతంబు ల
     గ్గలమై భోరన మ్రోసె నీశ్వరులతాగారంబు ఘూర్ణిల్లఁగన్.484
వ. ఇట్లు విపరీతమధుజృంభణంబు గని విస్మితుం డగుచు.485
క. శంభుసమాధికి విఘ్నా, రంభములై యులియువనచరములకు జిహ్వా
     స్తంభగతి స్తంభమున, స్తంభములుగ నంది హస్తసంజ్ఞ నదల్చెన్.486
వ. అంతం దదాజ్ఞాప్రభావంబున.487