పుట:కుమారసంభవము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కుమారసంభవము


చ.

మలయసమీర మర్థి సుకుమారలసత్సహకారనందనా
వలి నజిఁజొచ్చుఁ జుట్టుకొనివచ్చుఁ గుజాలికి మెచ్చు నీరిక
ల్విలు పొనరించుఁ గెందలిరు వెంచు ననల్ విరియించు దాని న
ర్మిలిఁ గబళించు నాదట రమించుఁదమిన్ విహరించు నామనిన్.

460


చ.

అలు లొడఁగూడుఁ బిండుగొని యాడు మృదుధ్వనిఁ బాడు నోట దొం
తులుగొని పాఱు జొంపములు దూఱు సుగంధము మీఱుఁ బువ్వుగు
త్తులపయి మూపు బుప్పొళులు ద్రావు వడిం దనివోవు మంజరుల్
వెలువడ నేఁగు దర్పమున వీఁగు మదిన్ నలిరేఁగు నామనిన్[1].

461


చ.

చెలఁగుచుఁ బాఱి యొక్కొకటిఁ జీఱి వనంబులు తూఱి చిల్కపిం
డెలఁబొఱఁ ద్రొక్కి కెందలిరు లెక్కి కొలంకులు నిక్కి చూచి కా
యలు గని మ్రానిపండ్లరస మాని ముదంబున నూని పల్కు మున్
పొలు పడరంగ దంపతులు వొంగ వియోగులు గ్రుంగ నామనిన్.

462


చ.

గుమురులు గట్టి యీరికలు గుట్టి ప్రవాళము వట్టి కింకతో
నమలక మ్రింగి మొగ్గలఁ బెనంగి విరుల్ గని వొంగి పూఁప లు
త్తమ మని చాని యుద్ధవడిఁ ద్రావికొను న్నెలమావియందుఁ గూ
రిమి పడఁజేయు నామనిని రేయుపవల్ వడి గూయుఁ గోవిలల్.

463


మత్త.

మెత్తమెత్తన చంచనాద్రిసమీరణుండు మనోభవుం
డెత్తకుండఁగ వేగకుండఁగ నెత్తు నొత్తిక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లాఱమిం గడ మాసరం బగు నామనిన్.

464


సీ.

ఆరగ్వధార్కజంజీరకర్కోలమందారచందననారికేరసింధు
వారకంకేళిఖర్జూరశాల్మలిఘనసారచంపకబీజపూరదేవ

  1. ఏఁగు శబ్దమున నఱసున్నకు :- "కాఁగానిమాట లాడెదు | రాఁగూడదు... నుండం | గాఁ గోమలి యిటు నిల్వక | యేఁగుము మగనాలి కేల యీదుర్గుణముల్" భోజ. ఆ.4; "తాఁ గడువేగిరించె... | లోఁగుచు నింత నుంగి... | నేఁగుచు .. | దాఁగుట దేనిపేరు నిలిడంబిక" ప్రభా. ఆ.5