పుట:కుమారసంభవము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

59


క.

నునుపగు నలిగానము విని, వనదేవత గరము మెచ్చి వానికి నొసఁగం
జనఁ బైఁడులవీడెలు పు, చ్చినవిధముగఁ బొన్న లెలమిఁ జెలువుగఁ బూచెన్.

452


క.

సురపొన్నలపైఁ బ్రాఁకిన, గురువిందలు నవలఁ బెరిగి కొమ రమరె రతీ
శ్వరునకు వసంతుఁ డనుగొన, పరి చేసినముత్తియములపందిరివోలెన్.

453


క.

మారుజయలక్ష్మి మలయస, మీరునిపైఁ బూఁత మధుసమృద్ధికి నురుశృం
గారం బనఁదగు నన సహ, కారముఁ గురువకముఁ గర్ణికారముఁ బూచెన్.

454


చ.

మొగడలు వజ్రముల్ విరులు ముత్తెము లింపగునున్పుగెంపు లేఁ
జిగురులు పద్మరాగములు చిల్కలు వైరిజరాజి తుమ్మెదల్
నగరిపునీలజాలములు నాఁ దనరారె వసంతవల్లభుం
డగువలరాజు పంచమణిహర్మ్యములో యనఁ జూతభూజముల్.

455


క.

చన నున్మదనమదనమో, హనసంతాపన వశీకరాస్త్రము లన హృ
జ్జనునకు నంకురపల్లవ, ఘనకోరకపుష్పఫలనికర మామ్రములన్.

456


సీ.

పలఁకెడు కారాకులలితాస్థిచయముగా సోలుకొమ్మలు పలుకేలు గాఁగ
బాలుపల్లవములు వ్రేలు కెంజెడలుగాఁ బెనఁగుతీగలు దొడ్డఫణులు గాఁగఁ
గలకంఠనికరంబు గళమునకప్పు గారబుప్పొడి మేనివిభూతి కాఁగ
ఫలములు వరదానఫలములు గా నలిమాలికల్ రుద్రాక్షమాలికలుగ
శంభుమూర్తిఁ దాల్చి సహకారభూరుహచక్రవర్తి నవవసంతవేళ
నతిశయిల్లుచుండె నక్కడఁ గని మరి నుదరిపడి మనోజుఁ డోసరింప.

457


చ.

అలరులమందహాసమున నన్నినషట్పదమంజుగీతి రా
చిలుకలముద్దుమాటలనుఁ జెందలిరాకులరాసలీలఁ గో
కిలనినదంబులన్ బహిరకేశభరంబున ముక్తపర్ణమే
ఖల నభిరామ మయ్యె సహకారలతాంగి మధుప్రసంగతిన్[1].

458


క.

తలిరెల్లిపూవుటమ్ముల, బలసిన పికకీరభృంగపరివారముతో
వలరాజుఁ బోలి మామిడి, సలలితగతి నుతపసంతసంగతి నొప్పెన్[2].

459
  1. "నా, చేననుచుంబతాకయును జెంచరుణాచలమెక్కి..” త్రిపురాంతకోదాహరణము.
  2. మన్మథునిఛత్రముపల్లవ మైనందులకు "కర్ణికారపుమొగ్గ కనకంపుగుబ్బగాఁ గోయిలనోరూరు గొడుగుతోడ" ఉ.హరి. ఆ-2. "కోకిలవ్రాతంబు గ్రుక్కిళ్ళు ప్రసంగించు క్రొమ్మావిచిగురాకుఁగొడుగుతోడ" హరవి. ఆ.3.