పుట:కుమారసంభవము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కుమారసంభవము


క॥

ఉదరమను చందనంబున । హృదయాంభోజాతనాళ మేర్పడి తనకొ
ప్పొదవి వెలిఁ దోఁచెనో యన । నుదతికి నూఁగారుదీగె సుందర మయ్యెన్.

295


క॥

పొరిఁగొనుదలము జవ్వనమున్ । సిరిగుచముల కెక్క నడవఁ జేసినకార్త
స్వరసోపానములన ము । త్తరఁగలఁ దగు నంగజాబ్ధితరఁగలు వోలెన్.

296


క॥

ఆంధ్రీస్తనాపహాసులు । సంధృతమధుపాబ్జముకుళసదృశము లతినీ
రంధ్రములు గుచము లఖిలపు । రంధ్రీజనతిలక మచలరాజాత్మజకున్.[1]

297


క॥

కేళీవర్తము లన రతి । కేళీసదనంబు లనఁగ గింశుకకళికా
మూలము లనఁ గామలతా । మూలము లన గౌరిబాహుమూలము లమరున్.

298


క॥

శివునంగముష్టి విరిఁగ । సవిరళముగఁ బట్టి ప్రాఁక నని కడునెమ్మిన్
నిపుడు నవకల్పలతికల । పవిదిని మృదుబాహులతలు పార్వతి కొప్పున్.

299


క॥

రుచిరాశోకదలద్యుతి । నచలజకరతలము లొప్పు నతిశయరాగో
పచితరతిరాజపల్లవ । రచితోభయమేఖడంబరంబులబోలెన్.

300


క॥

దురుచేత నుండి హరుగె । ల్వరు దుమచే నుండి గెల్వ నౌ నని సుమనః
శరములు గరముల నెలసిన । కరణిఁ గరాంగుళము లచలకన్యక కొప్పున్.

301


క॥

వరదము లగుకల్పలతాం । కురములొ విషమాస్త్రనిశితకోరకవిశిఖో
త్కరము లనఁ గరజములు సుం । దరి కగు నరుణోత్పలాగ్రదలములపోలెన్.

302


క॥

వినుతరుచిఁ బొల్చు నానన । మను నాదర్శంబుపిడియొ యతిమృదులీలం
జను బోఁకపోదెయో యన । ఘనరుచి నగసుతకుఁ గంబుకంధర మమరున్.

303


క॥

అమృతోద్భవులగు మీలో । నమరదు పగ యని సుధాకరాబ్జములకుఁ గూ
టము దనముఖమునఁ జేసెనొ । యుమ యన రదనాంశుగండయుగగతి వొల్చున్.

304


క॥

మానిత మగుగుడరసమున । నూనినతుండీరఫలమొ యొగి తేనెతల
న్నాని మృదువైనపవడమొ । నానద్రిజ తొప్పమోవి నయమై యొప్పున్.

305
  1. “ఆంధ్రీకుచాలింగితఁ..........సోయం సంప్రతి రాజశేఖరకవిర్వారాణసీం వాంఛతే.”
    అని యాంధ్రీస్తనములు కాఠిన్యమునకుం బ్రసిద్ధంబులుగా వర్ణింతురు.