పుట:కుమారసంభవము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కుమారసంభవము


క॥

తనపతిఁ జెట్టలు పలికిన । జనకుం గని కోపవహ్ని సతిదేహము భో
రన మండె భానుఁ గని కెం । పున మండెడు సూర్యకాంతపుత్రికవోలెన్.

178


గీ॥

అధిపుఁ [1]జెట్టలాడె నని దక్షుఁ గని । సతి కడరుకోపవహ్ని నొడలు గాలెఁ
వగవ నట్లై యెట్టివారికిఁ బ్రియనిరా । కరులఁ గాంచి యొడలు గాలకున్నె.

179


చ॥

పొలయునశోకవల్లి విరిపువ్వులగుత్తులమీఁదఁ గ్రాలుకెం
దలిరులొ నాఁగ మై నడరి దందడి వహ్నిశిఖాకలాపముల్
గలకొనఁ బ్రేలి దూలికొని కాలె రయంబున లక్కబొమ్మ న
గ్గల మగువహ్ని చుట్టుకొని కాలురయంబున నిస్తుషంబుగాన్.

180


వ॥

తదవసరంబున.

181


క॥

భోరన నుడుగక చెలఁగుత్ర । యీరవముల పెల్లు సెడి మహీసురమునిబృం
దారకతతి దెస నురుహా । హారవములు సెలఁగె దన్మఖాగారములన్.

182


వ॥

అంతక మున్ను కృతాంతకుండు తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సకల
భువనసంహారకారణాభీలకాలాగ్నిరుద్రోద్రేకంబున నభినయించువాఁడునుంబో
లె గోపానలోద్దీపితావేష్టితాతిభయంకరాకారంబు దాల్చిన.

183


మ. స్ర॥

వివిధాస్త్రానేకజాతావిరలబహులసద్విస్ఫులింగాగ్నియుం ద
త్పవమానాహారవక్త్రప్రకటితవిషవిభ్రాజితోగ్రానలంబున్
సవికారాత్మాతికోపోజ్వలతరవిపులజ్వాలియుం గూడి పర్వెన్
భవభాలాభీలనేత్రోద్భవశిఖిశిఖలన్ బద్మజాండంబు దాఁకన్.

184


వ॥

తదవసరంబున.

185


చ॥

ఖురపదఘట్టనం ధరణి గ్రుంగ ఫణీంద్రుఁడు నుగ్గునుగ్గుగాఁ
బరువడి నూర్పులం దొరలిపాఱఁ బయోనిధులుం గులాద్రులుం
బొరిఁబొరిఁ ద్రుంగ శృంగహతిఁ బొంద దివంబు నజాండమున్ మహే
శ్వరువృషభంబు నాక్షణమ వచ్చెఁ ద్రిలోకభయంకరాకృతిన్.

186
  1. “నూఱు చెట్టలు సైరించి శిశుపాలుఁ జంపె.” ఉ.హరి. ఆ4.