పుట:కుమారసంభవము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కుమారసంభవము


క॥

చతురోక్తుల నుతపదబహు | గతుల నలంకారభావకాంతిరసార్థో
న్నతిఁ గృతి నతిరసికులు వర | సతిగతి నెఱిఁగింపవలదె సౌభాగ్యమునన్.[1]

39


మ॥

పదబంధంబుల నగ్గలించి బుధశబ్దభ్రాజియై సద్గుణా
స్పదమై దుష్క హృత్సరోజవనముల్ భంజింపుచున్ భూరిస
మ్మదలీలన్ విలసిల్లి సత్కృతి జగన్మాన్యప్రభావంబునన్
మదనాగంబుమఁబోలెఁ గ్రాలవలదా మా ఱెందు లే కున్నతిన్.[2]

40


క॥

ముదమున సత్కవికావ్యము | నదరఁగ విలుకానిపట్టి నమ్మును బరహ్ళ
ద్భిధమై తలయూఁపింపని | యది కావ్యమె మలరిపట్టి నదియుం గరమే.

41


క॥

ఓలిన కడచన నరువది | నాలుగువిద్యలను నేర్పు నైసర్గికమై
వాలినసుకవులకుం గా | కేలతరమె కృతులు చెప్ప నెవ్వరికైనన్.

42


వ॥

అది యెట్లనిన.

43


క॥

వనజలకేళి రవిశశి | తనయోదయమంత్రకరిరతక్షితిపరణాం
బునిధిమధురురుపురోద్వా | హనగవిరహదూత్యవర్ణ నాష్టాదశమున్.

44


వ॥

పరిపూర్ణంబై దశప్రాణంబుల స్వప్రాణంబై నవరసభావభరితంబై షడ్త్రింశదలంకారాలంకృతంబై రమణీయం బైనదివ్యకథారంభంబున కభిముఖుండనై.

45


ఉ॥

పూని మహాగ్రహారపురపుత్రసమున్నతిదేవతాలయో
ద్యానతటాకసత్కృతినిధానము లాశశితారకంబు సు
స్థానములై మహిం బరఁగు జంగమమల్లయపేర సప్తసం
తానము లొప్ప సల్పుదు ముదంబునం దత్ప్రభునాజ్ఞ పెంపునన్.

46


వ॥

అందు నుత్కృష్టసంతానంబు కృతియకా నిశ్చయించి.

47


ఉ॥

జంగమమల్లి కార్జునుని సర్గకవిస్తవనీయసూక్తి యు
క్తిం గొనియాడి సత్కవితఁ గేనములే కనురక్త యైనభా
షాంగనఁదక్క నేలినమహత్త్వము లోకమునం బ్రసిద్ధిగా
భంగిగ విస్తరించెదఁ బ్రబంధము సద్రసబంధురంబుగాన్.[3]

48
  1. కృతికిని సతికిని శ్లేష
  2. కృతికిని మత్తగజమునకును శ్లేష
  3. కేనము = వట్టి పైగాంభీర్యము