పుట:కుమారసంభవము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

5


చ॥

సరళముగాఁగ భావములు జానుఁదెనుంగున నింపుపెంపుతోఁ
బిరిగొన వర్ణనల్ ఫణితి పేర్కొన నర్థము లొత్తగిల్ల బం
ధురముగఁ బారాణముల్ మధుమృదుత్వరసంబున॥ గందళింప న
క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయనలీల గ్రాలఁగాన్.[1]

35


సీ॥

మృదురీతి సూక్తు లింపొదవింప మేలిల్లు భావమ్ము నెలమి క్రీడావహముగ
మెఱుఁగులఁ గన్నులు మిఱుమిట్లు వోవంగఁ గాంతి సుధాసూతికాంతిఁ జెనయ
వర్ణన లెల్లచో వర్ణన కెక్కంగ రసములు దలుకొత్తి రాలువాఱ
దేశిమార్గంబుల దేశీయములుగా నలంకారములఁ దా నలంకరింప
నాదరించి విని సదర్థాతిశయముల | బుధులు నెమ్మనమున నిధులు నిలుప
వలవదే (రచింప) వరకవీశ్వరునకు | నూత్నరుచిరకావ్యరత్నవీథి.[2]

36


చ॥

పరఁగ సువర్ణబంధమృదుభావము గల్గియు లోను చూడఁగాఁ
బొర పగుచిత్రరూపమునుబోలె నసత్కవికావ్య మిమ్మహిన్
బరఁగు సువర్ణబంధమృదుభావవిశేషము లొప్పుదెల్వులన్
సరియగు రత్నపుత్రికయు సత్కవికావ్యము నొక్కరూపమై.[3]

37


ఉ॥

అక్కజమై మహార్థనివహంబు సరుక్తులు మెచ్చఁ జూచినం
గ్రుక్కిద మైనసత్కృతి యగుర్పగుఁగా కిలఁ జీకు లావుకం
ద్రొక్కినయట్లు నోరఁగొలఁదుల్ పురికొల్పఁగ నందులోన నొ
క్కొక్కఁడు సక్కనైనఁ గృతియుం గృతి యందురె నాని మెత్తురే.[4]

38
  1. ఒత్తగిల్ల = ఊఁదియుండఁగా
  2. కృతులకును రత్నములకును శ్లేష
  3. పొరపు = బోఱయైన, తెల్వులన్ = నీరులచే, చపులచే.
  4. అగుర్పు = పరులకు భయము కలిగించు పెంపు. ఈపదము ద్రవిడభాషలో
    ‘అగుర్పు’ అనియు, కన్నడమున “ఆగుర్వు’ అనియువాడఁబడును.
    “ముగిలం ముట్టిదపెంపు పెంప నొళకొం డుద్యోగ ముద్యోగదొళ్
    నెగ ళ్దాజ్ఞాబల మాజ్ఞెయొ ళ్తొదర్దగు ర్వొందొం దగుర్విం దగు
    ర్వుగొ ళుత్తి ర్పరిమండలం.” విక్రమార్జునవిజయము. ఆ-౧