పుట:కుమారసంభవము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కుమారసంభవము


క॥

మును మార్గకవిత లోకం | బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున | జన సత్యాశ్రయునితొఱ్ఱి చాళుక్యనృపుల్.

23


చ॥

సురవరులం గ్రమంబున వచోమణిసంహతి బూజ చేసి మ
ద్గురుచరణారవిందములకుం దగ సమ్మతిఁ జేసి కొల్చి వి
స్తరమతులం బురాణకవిసంఘము నుత్తమమార్గసత్కవీ
శ్వరులను దేశిసత్కవుల సంస్తుతిఁ జేసి మనోముదంబునన్.

24


వ॥

మఱియును.

25


క॥

గుఱు తెఱఁగి వస్తుచయమున | కొఱఁగెడు నాదెసకు వర్తియునుబోలె నిజ
మ్మెఱిఁగి కృతవస్తుసమితికి | వఱలఁగ మది నెఱుఁగువిబుధవర్గము దలఁతున్.

26


వ॥

మఱియు దోషగ్రాహు లగుకుకవివరాకులం బరిహరించితి నెట్లనిన.

27


క॥

మార్గకు మార్గము దేశియ | మార్గము వదలంగఁ దమకు మదివదలక దు
ర్గార్గపదవర్తు లనఁ దగు | మార్గవులం దలచ నలఁతి మహి సుకవులకున్.[1]

28


గీ॥

చెనసి గుణమైన దోషంబు సేయ నేర్చు | గుకవికృతులందు దోసంబు గుణముసేయ
నేరఁ డది యట్ల దొంతులు సేరి నాయి | దోర్పనేర్చుగా కదియేమి సేర్వ నేర్చు.[2]

29


గీ॥

నెఱయ రసవంత మగుకృతి కెఱఁగనేర | రల్పరసకృతి కెఱఁగుదు రలులకెల్లఁ
చెఱకు విడిచిన రసమున కెఱఁగి రాక | పిప్పి కరిగెడుఁగలపెల్లు వోలె.

30


వ॥

కావున.

31


గీ॥

తజ్ఞునం దేరనగుఁగవితావిశేష | మజ్ఞునం దేమి యెఱుఁగంగ నగు సమస్త
కనకవర్ణోత్కరమ్మును గానవచ్చు | వన్నె లెఱుఁగంగఁబోలునే వట్టిరాత.

32


వ॥

అది యెట్లనిన.

33


గీ॥

అన్యతారకవితతుల నాదరించి | వెలయ సత్కవిబుధగురుబలము వడసి
యొనర దైవజ్ఞునట్ల శుభోదయమున | దివ్యసుకృతిఁ బ్రతిష్ఠించుఁ దిరము గాఁగ.

34
  1. మార్గకవిత = డాంధ్రకర్ణాటాదికవిత
  2. నాయి = కుక్క