పుట:కుమారసంభవము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

3


వ॥

అని సద్భక్తియుక్తి నిశ్చయించి.

13


క॥

శ్రీపీఠంబున నిడుకొన | శ్రీపాదుకలందు వ్రాలి సేవించెద నేఁ
బాపహతిఁ జెప్పి పుణ్యం | బాపాదింపంగ మల్లికార్జునదేవున్.

14


మ॥

అమలజ్ఞానసుదీపవర్తి గొని వృద్ధాచారుఁడై వేదశా
స్త్రములం దున్న సదర్థ మెల్లఁగొని విద్వత్ప్రీతి గావించువా
ని మహాత్ముం డనఁ బొల్చుపుణ్యనిధి వాణీముఖ్యు సర్వజ్ఞు జం
గమలింగం బగుమల్లికార్జును సదాకల్యాణుఁ గీర్తించెదన్.

15


వ॥

అని యిష్టదేవతానమస్కారము చేసి సమస్తదేవతాస్వరూపం బైనమదీయగురుచరణారవిందంబు లభినందించి.

16


క॥

కవితామృతోదయాంబుధి | కవిసజ్జనకునకు వస్తుకావ్యాబ్జరవిన్
గవితారంభంబుల స | త్కవు లభినందింతు రాదికవి వాల్మీకున్.

17


క॥

వేదాంతభారతపురా | ణాదులు సేయఁ డొకపేర్మి యనుచుం బొగడం
గా దెడ్డనజుఁడు నోపని | వేదము లేఱ్పఱిచె నండ్రు వేదవ్యాసున్.

18


క॥

భాసురమతి వాల్మీకి | వ్యాసాదులు చనిన జగతి వరకవితాసిం
హాసన మెక్కి కవీంద్రుల | దాసులఁగా నేలెఁ గాళిదాసుఁడు పేర్మిన్.

19


క॥

భారవియు వస్తుకవితను | భారవియునుఁ బరఁగి రుదయపర్వతశిఖరా
గ్రారోహణేంద్రకీలన | గారోహణవర్ణనల జనారాధితులై.

20


క॥

క్రమమున మద్భటుఁడు గవి | త్వము మెఱయఁ గుమారసంభవము సాలంకా
రము గూఢవస్తుమయకా | వ్యముగా హరులీల చెప్పి హరు మెచ్చించెన్.

21


క॥

కరములు దునుమం బరముని | వరదునిగాఁ గొలిచి కవితవలననె మగుడం
గరములు వడసి జగంబునఁ | బరఁగె మహాకవియనంగ బాణుఁడు పేర్మిన్.[1]

22
  1. పరముని = శివుని. కరములు = చేతులు, కానుకలు. పరమశబ్దమునకు:- “పరముఁడు కంధరస్థలముపై నిడి వేడుక ముద్దులాడఁగాఁ | గరమున మౌళిగంగయుదకంబులు మెల్పున బీల్చి యావిశీ | కరములు భూషణేందునకు గౌరవతారఃలీలఁ జేయు త | త్కరివదనుండు మత్కృతికిఁ దాను ముఖస్థితితోడఁ దోడగున్.” అని యమరేశ్వరుని విక్రమసేనము.