పుట:కుమారసంభవము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

కుమారసంభవము


చ॥

అమితరజోగుణస్ఫురణ నావహమై పరమేశుదక్షిణాం
గమున జనించి భక్తిఁ జిరకాలము సద్విధిఁ గొల్చి తత్ప్రసా
దమున నజాండలోకజనితత్వసువేదకళాగమాదివి
శ్వము సృజియించి పొల్చునజు వాగ్విభు సంస్తుతిచేసి సన్మతిన్.

5


చ॥

అనుపమదివ్యమూర్తి యనునంతియ కాదు భవాష్టమూర్తులం
దును వరమూర్తి దాస ప్రభతోడ జగజ్జనరాజి కెల్ల నిం
దనయము దానదృష్టి యనునంతియ కాదు త్రిలోచనాదిలో
చనములు దానయైనరవి చారునిజప్రభ మాకు నీవుతన్.

6


చ॥

తను వసితాంబుదంబు సితదంతయుగం బచిరాంశు లాత్మగ
ర్జన మురుభర్జనంబు గరసద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్యసమృద్ధిగ నభ్రవేల నాఁ
జనుగణనాథుఁ గొల్తు ననిశంబు నభీష్టఫలప్రదాతగాన్.

7


క॥

తనజనకుఁ డురుస్థాణువు | జనని యపర్ణాఖ్య దా విశాఖుం డనఁగాఁ
దనరియు నభిమతఫలముల | జనులకు దయ నొసఁగుచుండు షణ్ముఖుఁ గొలుతున్.

8


క॥

హరుఁ డాదిగ సకలచరా | చరమయజీవాళి నెల్ల సతతముఁ గామా
తురులుగ వలగతిఁ జేసిన | మరుఁ డీవుత మఖిలవశ్యమతి మత్కృతికిన్.[1]

9


చ॥

మునిమనుజాశురాహిసురముఖ్యులు మున్నుగ సర్వజీవులం
దనవశ మర్థి జేసి మునుదర్పకు నోర్చినవీతరాగిఁ జి
ద్ఘనతను నీశు నాత్మశుభగస్థితి మైమెయి నర్ధనారిఁ జే
సిననగజాత మత్కృతిని జేకొని తత్సుభగత్వ మీవుతన్.

10


క॥

వేదాగమరూపమున మ | హాదేవు నపారగుణమహాస్తుతిసం
పాదిత యగుభారతి నేఁ | డాదిగ మత్కతికి నెలయునది గాక దయన్.

11


గీ॥

అన్యదైవవితతి నర్చించుకొలువు తా | డిడి ఫలంబుగొనుట పడయఁగనెడి
సద్వరిష్టఫలదు జంగమమల్లికా | ర్జునునిఁ గొలుపు మొసరుమునుఁగఁగొనుట.[2]

12
  1. వలగతి = అనురాగపురీతితో
  2. మొసరుమునుఁగకొనుట = మకరందముతోడ సంపూర్ణముగా నందుకొనుట యని తోఁచుచున్నది.