పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కోప మెక్కువ తాల్మి కొఱఁత కార్యము సున్న
                   నిలుకడ నాస్తి దుర్నీతి ఘనము
కనికరం బిల్ల దుర్గర్వ మగ్గము సత్య
                   కౌచముల్ కల్ల మచ్చరము హెచ్చు
కాపట్య మురు వహంకారంబు గాటమ్ము
                   పొగరు దట్టము ద్రోహబుద్ధి దళము
పరధనాపేక్ష నిబ్బరము లోభము పెల్లు
                   పరహితచింత నిప్పచ్చరమ్ము


తే.

ధర్మమతి తొట్టు నీ యిట్టి దుర్మదాంధ
నృపకులాధము లేరి కేమియ్యఁగలరు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

58


సీ.

అందలంబెక్కుట యవనిఁ బ్రశస్తమా
                   మ్రానెక్కి నిక్కదే మర్కటంబు
తొడవులు దొడుగుట దొడ్డసౌభాగ్యమా
                   కడుసొమ్ము లూనదే గంగిరెద్దు
విత్తంబు గూర్చుట విమలబ్రచారమా
                   బహునిధుల్ గావఁడే భైరవుండు
ప్రజల దండించుట పరమసంతోషమా
                   ప్రాణులనెల్ల నేపఁడే జముండు


తే.

దొరతనంబున కివి గావు వరుస లరయ
సాహసౌదార్యఘనపౌరుషములు గాని,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

59


సీ.

దానవైఖరిని రాధాతనూభవుఁ బోలి
                   చిరభోగమున శచీవరుని బోలి
కారుణ్యమున రఘుక్ష్మావరేణ్యుని బోలి