పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నిక్కి మిక్కుటమైన యాదొక్కి బొక్కి
లో టక్కరి నృపాలకులకీ ర్తి దక్కునొక్కొ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

53


సీ.

అనయమ్ము రాజ్యాంతమున నరకము ధ్రువ
                   మ్మని స్మృతుల్ వచియింప వినఁగలేదొ
మును హరిశ్చంద్రాది మనుజేంద్రు లనఘులై
                   చనిరన్న సత్కథల్ వినఁగలేదొ
దండధరుండు మీఁదట దురాత్ములఁ బట్టి
                   వెతఁ బెట్టునను మాట వినఁగలేదొ
మహిలోన జాతస్య మరణం ధ్రువమ్మని
                   విబుధులు పలుకంగ వినఁగలేదొ


తే.

కాని దుర్మతులయి ప్రజఁ గలంచి ధనముఁ
గూర్పఁజూతురు బేలలై కూళదొరలు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

54


సీ.

మరుమరీచికలు తామరసపత్రాంతర
                   సలిలబిందువులు చంచలలు హస్తి
కర్ణాంతములు దీపకళికాశిఖలు బుద్బు
                   దములు మంగలి చేతిదర్పణములు
మిణుఁగురుఁబురువుల మెఱపు లభ్రచ్ఛాయ
                   లైంద్రజాలికు నాట లంబురాశి
వీచులు చలదళవృక్షపలాశముల్
                   తృణహుతాశనముల తెఱఁగు లిట్టి


తే.

సిరులు నిలుకడలని నమ్మి చెనఁటు లురక
చెడుదు రెన్నడు ధర్మంబు సేయలేక,