పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవిబుధవందిమాగధులచెల్మి ఘటించుఁ
                   బగరయైనను వెంటఁ బడి చరించు


తే.

గలియుగంబున నబ్బబ్బ కలిమివంటి
మంచివస్తువు కలదె యోజించి చూడ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

51


సీ.

బంధుజాతములోన బహుమాన మెడలించు
                   సభలలో మాటాడఁ జనవులేదు
పరమైన విజ్ఞానసరత సిద్ధించదు
                   కుమతులు గెగ్గెర్లఁ గొట్టుచుంద్రు
పరభూమి కేఁగినఁ బాటింపరెవ్వరుఁ
                   బ్రతిభావిశేషంబు పట్టువడదు
ధారుణీపతు లొక్కదానమే నొసఁగరు
                   కులసతి యతనిఁ దక్కువగఁ జూచు


తే.

నకట విద్యావిహీనత యంత కీడు
లేదు గద మర్త్యులకు ధాత్రిమీఁద నరయ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

52


సీ.

కడుపార ఘృతమాంసఖండముల్ కడు మెక్కి
                   పుక్కిటఁ దమలంబు తుక్కు ద్రొక్కి
లావగు గడితంపుఠీవి గన్గొని నిక్కి
                   విడువక గేస్తుల మెడలు నొక్కి
కూర్చు రొక్కము చందుగులఁ గ్రిక్కిఱియఁ గ్రుక్కి
                   కసరుచు జనులపై విసము గ్రక్కి
కవిబుధవరుల ఢాకలకు మూలలఁ జిక్కి
                   కక్కుచుఁ బల్లకీ కుక్కులెక్కి