పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

దయ్యమా కాయకసరైన దక్కనియ్య
రేమి సేయుదు మను మోటులిలను గలరు
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

31


సీ.

యెద్దుమందను గూర్చి యెగసాయమిడితేను
                   తుది నది యధికారి దోసుకొనియె
దాపుదప్పులకంట దర్మకర్చులకంట
                   కాసువీసము లాగె కరణపయ్య
సల్లమ్మి పవకమ్మి సిల్లర దాసితే
                   కోమటి నాబంటుకొడుకు దొబ్బె
కళ్ళము కంకులు గాలిఁ బట్టగఁ బోతె
                   బట్టుబాపనవోళ్ళు బతగనీయ


తే.

రహహ దందర మిటులయ్యె ననెడి మోటుఁ
బెద్దదొక్కుడుగాళ్ళఁ జెప్పెడిదిఁకేమి,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

32


సీ.

కాకంబునకు రత్నఖచితపంజరమేల
                   పందికి ముత్యాలపందిరేల
యీపిటీఁగకు మేటితీపుఁదేనియ యేల
                   శ్వానంబునకుఁ బట్టుజాలరేల
మహిషంబునకు మృగమదవిలేపనమేల
                   కోతికి బంగారుగొలుసులేల
గర్దభంబునకు బంగారుపల్లంబేల
                   షండున కందమౌ జాణ యేల


తే.

పరమలోభికి నృపసభాప్రథితమహిమ
సుకవికృతభవ్యకావ్యవిస్ఫురణ యేల