పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కలయిర్పులెట్టి తొందరగాఁగ దండకాల్
                   సతకాలు సోకాలు సతుకుకొంట


తే.

ఎంటఁ బట్టిరి గదరబ్బ యనెడు మూఢ
కష్టచిత్తుల కిఁక మఱెక్కడి యశంబు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

29


సీ.

పాతపొత్తపుకట్ట సేత పట్టుకవచ్చి
                   దోసిబాపఁడనంట దోసిలొట్టి
జలము సంద్రుఁడటంట సని సాలదనుకొంట
                   సెడుగు వాసారులు సెప్పుకుంట
తిండికిఁ దెమ్మంట దేయిరింపుచు తూపె
                   తూపెకు సేతులు సాపు గాని
మఱఁదలెన్నఁడు పెదమనిసైనదంటేను
                   తప్పక మూత్రంబె సెప్పలేఁడు


తే.

సీ యితనికంటె సాకలిసెల్లిగాఁడు
మేలనెడు మోటకొయ్యల నేల దెలుప,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

30


సీ.

కరణాలటంటను కైలకట్టల యిప్పి
                   పాతికలంటను పరిగలంట
కాన్లంట గీన్లంట కలయి లేనియి కొన్ని
                   సెల్లులు బాకీలు సెప్పుకొంట
బిరబిర గంటాలు గిరగిర దిప్పుతా
                   నాకులన్నియు నెడ గోఁకుకుంట
యెగరాసి దిగరాసి సగమేసి యెగదొబ్బి
                   కొంపలు పడదోసి సంపుతారు