పుట:కాశీమజిలీకథలు -09.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

93

ఇప్పుడు పోవవలదని యాదిత్యవర్మ జెప్పుచునే యున్నవాఁడు రాజవాహనుఁ డెందు బోయెనో తెలియదు. ఇప్పుడు మన రాజుగారితోఁ జెప్పి కొన్ని సేనల నందుఁ బంప వలయునని తలంచి వచ్చితిని. రాజపుత్రిక యెట్లున్నది? నన్ను గుఱించి యేమను చున్నది. చెప్పుమని యడిగిన నవ్వుచు రాగవతి యిట్లనియె.

అమ్మా! ఆమె పని యామెకైనది. నిత్యము నిన్నుస్మరించుచునే యున్నది. వినుము రాజువాహనుఁ డా చెఱసాలనుండి తప్పించుకొని వెదకికొనుచుఁ దిన్నఁగా మన యింటికి వచ్చి నిన్నుఁ బిలిచెను. నేను బోయి లేదని చెప్పి యతని కథ విని యంతఃపురమునకుఁ దీసికొనిపోయితిని. రాజపుత్రిక వానిం జూచి మోహవివశయై సిగ్గు వదలినది. గౌరవము మరచినది. కులపరిపాటి విడిచినది. సఖులనెల్ల దూరముగా బోఁ బనిచినది. నన్ను మాత్రమే చెంతచెంతలకు రానిచ్చుచు బనులఁ దెలుపుచున్నది. ఆపులిందుడు రెండవ పిట్టనుగూడ నిక్కడికి బంపివేసెను. దాని వలన గొన్ని కథల వినినది. దానికి లోపలి యుద్యానవనము నందలి కేళీసౌధంబున బస యిచ్చినది. తండ్రి శరబసేనలతో జయపురము మీదికి దండెత్తి పోయెనని తానందు బోవుటకు నా ముఖముగా నడిగిన నంగీకరింపక మొన్నరాత్రి వాని దనవశము జేసికొన్నది. నన్ను మొగసాల గాచియుండుమని నియమించినది. అమ్మా! నీతో నేమని చెప్పుదును. ఈ మూడు దినములు వారికొక గడియవలెనైన వెళ్ళలేదు.

చ. ఒకతరి వల్లకీనినద మొక్కతరి న్మృుదువేణునాద మిం
    కొకపరి కిన్నరస్వరము లొప్పగ బాడుచు వేడ్కురాగదీ
    పకముగ రాత్రియుం బగలు బాయక నీ సఖురాలు పుష్పసా
    యకవిహితక్రియానిరతయై యతనిం గరగించె బాణయై.

తత్కేళీలాలసుండై రాజవాహనుండు తనదేశము తనవారి దన్నుగూడ మరచియున్నవాడు. అమ్మా! నీవు లేకున్నను నీవు తలంచిన కార్యము నెరవేరినది. నే నిప్పుడే యందుండి వచ్చితినని చెప్పిన విని యశోకవతి నెఱుగుపాటుతో నెట్టెట్టూ? రాజవాహను డిందు వచ్చి రాజపుత్రికం గలిసికొనియెనా? అతండు కిరాతకులజుండని సంశయింపక యా చేడియ వానిం గూడినదా? మేలు మేలు. భేషు భేషు. వినదగిన మాట వింటినని సంతసించుచు నప్పుడే యామె శుద్దాంతమునకు బోవలయునని తలంచినదికాని రాగవతి వారించుచు నమ్మా! ఈ రేయిగూడ వారు వేడుకలం గూడుచు మనతో మాటాడరు నేటితో ద్రిరాత్రదీక్ష పూర్తియగును. ఉదయమునం బోవుదమని యడ్డు చెప్పి యప్పటి కాపినది.

నాటి వేకువ జాముననే లేచి యశోకవతి రాగవతితో గూడ గల్పలత మేడకుం బోయినది. ద్వారదేశంబున నిలువఁబడి యాకర్ణింప గల్పలత భర్తతోఁ బరిహాస మాడుచు -