పుట:కాశీమజిలీకథలు -09.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11]

చంద్రవర్మ కథ

81

రమ్మనమని సూచించినది. దానిసంజ్ఞ గ్రహించి నేను దానివెంటఁ గొంచెము దూరము పోయితిని.

అందొక లతాకుడుంగములో ప్రతతివిలాసములచేఁ జుట్టుకొనబడియున్న యాఁడుకోఁతిని నాకు జూపినది. నే నాసన్న గ్రహించి తటాలున బోయి కటారికొని నా లతాపాశంబులం గోసి యావానరిని విడిపించితిని. అప్పుడు మగకోఁతి యాఁడుకోఁతిని నాపాదములఁ బడవేసి నన్నుఁ గదలనీయక యాప్రాంతమున కెక్కడికోపోయి గడియలో నొక ఫలముఁ దీసికొని వచ్చి నాకర్పించినది.

దాని కృతజ్ఞత్యమునకు మేము మిక్కిలి యక్కజమందుచు నాఫల మిరువురము భుజించితిమి. క్షుత్పిపాసలు నశించినవి. ఆదివ్యాధులబాధ దొలఁగినవి. ప్రహర్షముతో వెండియు గుఱ్ఱము లెక్కి యుత్తరాభిముఖముగా నరిగితిమి. తెఱపిదేశముల కరిగిన నా భూపాలుఁడు వెదకి పట్టికొని శిక్షించునని భయముతో నరణ్యమార్గమునే పోయి పోయి కొంతకాలంబున కీకాంతారము జేరితిమి.

అందొక వరాహం బొక భిల్లపతి వింటిబారి తప్పించుకొని పారిపోవుచుండ నే నడ్డమై యొక్క వాడిశరంబున దానిం బడవేసితిని. అక్కిరాతపతి మదీయకరలాఘవమున కచ్చెరువందుచు సగౌరవముగా నన్నుఁ దన పల్లెకుం దీసికొనిపోయి సేనాధిపతిగాఁ జేసికొని తనయొద్ద నుంచుకొనియెను. నే నయ్యిందువదనతో గందర్పక్రీడల నానందించుచు భిల్లపతి చెప్పిన పనులు నిర్వర్తించుచు నధికవిశ్వాసముతోఁ బెద్దకాల మతనియొద్దఁ గొలువు సేసితిని. అతండు మృగవశ్యౌషధితంత్రములు మంత్రములు ననేకములు నాకుఁ దెలియజేసెను. ఆ నిషాధాధిపతి యపుత్రకు డగుటఁ జివరకు మరణకాలమున నన్నీ భిల్లరాజ్యమునకుఁ బట్టభద్రుంజేసి స్వర్గమునకు నిర్గమించెను.

నాకు మూఁడువేల సంవత్సరముల వయస్సున్నది. తత్ఫలభక్షణంబునం జేసి యింతకాలము బ్రతుకఁ గంటిమి. మాకు నేగురుకొమాళ్ళు పుట్టిరి. కాని విశ్వాసఘాతుకపాతకంబునం జేసి వంశము నిలిచినదికాదు. చివరకు మేమిద్దరమే మిగిలితిమి. ఈ వసంతమాల మా కౌరస పుత్రికకాదు. విను మే మొకనాఁ డటవికి వేటకుఁబోయి గ్రామములనుండి మదమెక్కి యొక యేనుఁగు యడవులలో సంచరించుచున్నదని విని దాని నిమిత్తము కొండలోయలన్నియు వెదకించితిని.

చివరకొక కోనలోఁ దిరుగుచున్న యమ్మతంగగజమును గనుఁగొంటిమి వీపుమీఁద నంబారీ యున్నది. అందొక తొట్టిలోఁ బండుకొని యీ బల తిత్తిలోని పాలు గ్రోలుచుండెను. వశ్యతంత్రంబున నేనా యేనుఁగను బట్టుకొని కట్టించి యంబారీలోని శిశువుం దింపి ముద్దుపెట్టుకొనుచు నింటికిం గొనిపోయి నా భార్య కిచ్చితిని అప్పటికి పట్టికి రెండేడుల యాయుష్య ముండునేమో? నాభార్యవద్ద బాలికను అమితమగు గారాముగాఁ బెరుగుచుండెను. క్రమంబున నా బాలికకు సంగీతము