పుట:కాశీమజిలీకథలు -09.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

సాహిత్యము ధనుర్విద్య అశ్వగజారోహణ నైపుణ్యములోనగు విద్యలన్నియు మేమే నేర్పుచుంటిమి.

దానినిఁ దల్లి పుళిందిని యనియు నేను కలభ యనియు బిలుచుచుంటిమి. ఆ బాల తలిదండ్రులము మేమే యని తలంచుచు కాని యెక్కడనుండియో వచ్చితినని యెఱుఁగదు. ఎవ్వరును దానికీకథఁ జెప్పలేదు. మేము పుట్టిన బిడ్డకంటె నెక్కువ ప్రేమతో బెంచుచున్నారము. మఱియొక రహస్యము. వినుము ఈ శిశువును మా యింటికిఁ దెచ్చిన కొన్ని నెలలకు మహారాష్ట్రాధిపతియగు శ్రీమంతుని దూతలు కొందఱు మా యడవికి వచ్చి యంవాఠీతోనున్న యేనుఁగ యొకటి పారిపోయి వచ్చినది. ఈకాన నెందైనఁ గనంబడలేదుగదా అని యడిరిగి. వారివలన నా గజవృత్తాంతము దెలిసికొంటిని. ఈ బాల శ్రీమంతుని మనమరాలు. దీని జన్మదినోత్సవమునఁ దల్లితోఁగూడ నీబాల నేనుఁగ నెక్కించి యూరేగింపుచుండిరట.

నడుమ మద మెక్కి యా యేనుఁగు మావటీనింజంపి మీఁదనున్న రాజపుత్రికం బరిమార్చి పెచ్చు పెరిగి యెవ్వరికిం దొరకక కాలికొలఁది పారి పారి క్రమంబున మహారణ్యంబులం బడినది. "ఆయుర్మర్మాణి రక్షతి" అను నార్యోక్తి ననుసరించి యా బాలిక కాయుశ్శేషముండఁబట్టి యెట్లో బ్రతికి మాకు దొరికినది. మా బాల కిరాతపుత్రికకాదు. మహారాజ వంశ ప్రసూత. రాజదూతలకు నిజము జెప్పినఁ దీసికొనిపోవుదురను భయంబున మాకేదియుఁ గనంబడలేదని బొంకి పంపితిని. మహారాజా! ఇంతవరకు నీ రహస్యము లెవ్వరికిం జెప్పక గుట్టుగా నుంచితిని. మిమ్మప్పటికి జరాభారము పీడించుచున్నది. కొలఁదికాలములో దేహములు విడుతము. నీవు సమర్థుండవని నీకుఁ దెలియఁజేసితిని. సత్కుల ప్రసూతయగు మాకలభను నీవు భార్యగా స్వీకరించి యీ రాజ్యము పాలింపుము. భిల్లసేనలం గూర్చుకొని మీ రాజ్య మాక్రమించుకొనుము. ఇదియే మదీయవృత్తాంతమని యెఱింగించిన విని విజయపాలుం డపారవిస్మయపారావారవీచికలఁ దేలియాడుచు నతండు చెప్పినయట్లు చేయుట కంగీకరించాను.

శుభముహూర్తంబునఁ జంద్రవర్మ భిల్లరాజ్యముతో గూడఁ విజయపాలునకు గలభ నిచ్చి వివాహము గావించెను. మఱియు దా నెఱింగిన మంత్రతంత్రములన్ని నల్లునికిం జెప్పెను. మఱికొంతకాలమున కా దంపతులు నాక మలంకరించిరి.

విజయపాలుండు భిల్లపతియై దుందుభియని పేరుపెట్టుకొని భార్యతో గూడ ననంగకేళీలాలసుండై సంసారసుఖం బనుభవింపుచుండెను. నానావిధపశుపక్షి మృగంబులం బట్టితెచ్చి యాటపాటలు నేర్పి మహారాజుల కమ్ముచుఁ జాల ధనము సంపాదించెను. సుమతిం భరిభవించిన కృతఘ్నత్వదోషంబునంజేసి యతని కెన్నఁడును భిల్లసేనలం గూర్చుకొని జయపురరాజ్యంబు సంపాదింపవలయునను బుద్ధిపుట్టినది