పుట:కాశీమజిలీకథలు -09.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనకలతిక కథ

69

నడుమ మధువర్మకొడుకు దన కేదేశము వచ్చునని రామచిలుకను బ్రశ్న మడిగెనఁట. ఏదియు రాదు. నీవు రాజ్యభ్రష్టుండ వగుదువని చెప్పినదఁట చిత్రము వింటివా ?

కన - మేలు మేలు. లెస్సగాఁ జెప్పినది. అన్యాయముగా నీదేశ మాక్రమించినందుల కట్లు కావలసినదే. అని పలుకుచు నప్పుడే యా పరిచారికను మఱఁది యొద్ద కనిపినది.

అది వోయి వచ్చి దేవీ ! కారాగృహంబు కడు పరీక్షలతో నొప్పునఁట. మిము బోటివారు వచ్చిన శంకింపక మానరు. తదధికారి సెలవు లేనిదే క్రొత్తవారు లోపలకుఁ బోవఁగూడదఁట. మేము కూలివాండ్రవలెఁ బోయితిమి. నీవుగూడ రూపము మార్చి వచ్చిన రావచ్చునని నామఱఁది చెప్పెను. ఇందుల కేమనియెదవని యడిగిన నయ్యెల నాగ యిట్లనియె.

రూపము మార్చుటకు నాకేమియు సందియములేదు. నీదుస్తుల నాకిమ్ము. గట్టుకొని వచ్చెద. నెప్పుడు రమ్మని చెప్పెను? అనుటయు నవ్వసుమతి అమ్మా! బందీగృహాధికారి నాలుగుగంటలు కొట్టువఱకు నందుండును. పిమ్మట నుప్పరిగకుఁ బోవునప్పుడు రమ్మని చెప్పెనని యెఱింగించినాఁడు. కనకలతికకుఁ బరిచారికావేషము వైచి తన వెంటఁబెట్టుకొని యతం డెఱింగించిన వేళకు నబ్బందీగృహాంతరమునకుఁ దీసికొనిపోయినది.

సీ. మెడలఁ గాడి వహించి గడుభార మిడిన బల్
               రాతిబండ్లను బట్టి లాగువారు
    పెనురాతి తిరుగళ్ళ కొన గూర్చునినుప గు
               రుసుఁ బట్టికొని పిండి విసరువారు
    నునుమ్రానఁబూన్పు గానుగఁ లాగుచును గిర
               గిర నూనిగ్రక్కంగఁ దిరుగువారు
    ఇనుపసుత్తులఁ బూని పెనురాలు పగుల గం
               కర గొట్టి గుట్టలఁ గట్టువారు
గీ. తరులఁ గేదారములకు నేతాము లెత్తి
    తోయమును గాలువలు వారఁ దోడువారు
    నేర్పుమీరంగఁ బట్టలనేయువారు
    కార బంధింపఁబడినట్టివార లెల్ల.

అట్టి వారినెల్ల నాలోకించుచు నాలోలలోచనఁ గ్రమంబునఁబోయి పోయి యొక వసారాగదిలోఁ గూర్చుండి యేదియో ధ్యానించుచున్న రాజువాహనునింజూచి –

క. చూచి తలయూచి మే లా
    హా! చతురాననుని సృష్టిచాతుర్యం బా