పుట:కాశీమజిలీకథలు -09.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కన – వసుమతీ! అట్టిసుందరుఁడు మన బందీగృహంబున కెట్లువచ్చెను? నీ వెట్లు చూచితివి?

వసు – నా చెల్లెలి మగనికిఁ జెఱసాలలో బని. మా మఱది నిత్యము భార్యయొద్ద నతని చక్కదనముఁ బొగడుచుండ నది నాతో జెప్పినది. మే మిద్దరము నిన్నఁబోయి చూచితిమి. ఆహా! అట్టి మోహనాంగుఁడు పుడమియందేకాక నాకసము నందుఁ గూడ మరియొకడు లేడని చెప్పగలను.

కన - చాలు. యువకు లందరు నీకుఁ జక్కనివారుగానే కనంబడు చుందురు. సౌందర్యమన నెట్టిదో నీ వెఱుంగుదువా ?

వసు - తల్లీ! నీకుఁ బరిచారికనై యా మాత్ర మెఱుఁగకుందునా? పెక్కేల? వాని నీవు చూచిన మూర్చనోవుదువు.

కన - (నవ్వుచు) భయపడియా యేమి?

వసు - భయపడియో. మోహపడియో.

కన - వాఁడు చోరుడై బద్దుం డయ్యెనా?

వసు - వాఁడు మానినీహృదయచోరుడు.

కన - మరియేమిటికి వానిం బట్టుకొనిరో ?

వసు - మధువర్మ మీతండ్రియగు మందపాలునివంటివాఁడు కాఁడు. కడు క్రూరుఁడు. పాపము వాఁడు గుఱ్ఱమెక్కి వీథిం బడిపోవుచుండ నది యపరాధమని బట్టించి చెఱసాలం బెట్టించెనఁట.

కన - వాఁడు శూరుం డంటివే? యెట్లు పట్టుపడెను?

వసు — అది దైవికము, వేయిమందినిఁ గడతేర్చి చేతినుండి విల్లుజారి పడుటచే దొరకెనఁట. కానిచోఁ బరమేశ్వరుఁడు వానింబట్టుకొనఁ గలఁడా?

కన - వాఁ డేకులమువాఁడు?

వసు - అద్భుతతేజము వాని మొగంబునఁ బ్రవహింపుచున్నది. క్షత్రియుడే కావచ్చును.

కన - వానిబంధువు లెవ్వరును లేరా?

వసు - ఆ వార్తలేమియు నాకుఁ దెలియవు. మా మఱఁది జెప్పిన నిన్నఁ బోయి చూచితిమి. పాపము వానిచేఁ బని చేయుచుండఁ జాలి పోడమినది.

కన - కడు పొగడుచుంటివి. నేను చూచుటకు వీలగునా?

వసు - మా మఱఁది నడిగి చెప్పెదను.

కన - వీరిదేశవిభజనము మాట యేమైనది ?

వసు – ఈదేశములో నుత్తరదేశము సారవంతమైనదట.. దక్షిణదేశము నిస్సారమఁట. ఇరువురు నుత్తరదేశమే కావలయునని తగవు లాడుచున్నారఁట. ఈ