పుట:కాశీమజిలీకథలు -09.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9]

సునందుని కథ

65

పడరాదు. పెద్దలున్నారు. యథావిధి వివాహ హోత్సవము జరుగవలసి యున్నది. మా యన్న బంధవిముక్తుఁ డయ్యెనని చిలుక చెప్పినమాట సత్యము కావచ్చును. ముందుగా మన మక్కడకుఁ బోవుదము. అచ్చటి స్థితిగతులు విచారించి కర్తవ్యముల నాలోచింతమని పలికిన విని యతం డంగీకరించెను.

వారు మరునాఁడు ప్రయాణ మగుచున్న సమయంబున నాదిత్యవర్మయు నశోకవతియు నచ్చటికి వచ్చిరి. అశోకవతి శ్రమణిం జూచి యోహో! రాజువాహనుఁ డిందే యుండెనే. బద్ధుండయ్యెనని చెప్పినమాట యసత్యమా యేమి? విడిపించుకొని వచ్చెనా? అని యాలోచించుచుఁ దాపునకుఁ బోయి రాజవాహనా! అని పిలిచినది. శ్రమణి తెల్లపోయి పురుషవేషంబుతో నుండుటంబట్టి యశోకవతిం గురుతుపట్టక చూచుచుండెను.

అప్పుడు సునందుఁ డితఁడు రాజవాహనుఁడు కాఁడు. అతని తమ్ముఁడని చెప్పెను. ఓహో? వానికిఁ దమ్ముఁ డెక్కడ నున్నాఁడు? నే నెరుఁగనా? నిజము చెప్పు డనుటయు శ్రమణి మీ రెవ్వరు? వారి నెట్లెరుఁగుదురు? అని యడుగుటయు నాదిత్యవర్మ వారి సంవాదమంతయు నాలించి మీరిరువురు వేషంబుల మార్చుకొనుటఁ జేసి యొండొరుల గురుతెరుఁగ కుంటిరి అవ్వలికిఁ బోయి రహస్యముగా సంభాషించు కొనుఁడు. అంతయుం దెల్లము గాఁగలవని పలికెను. ఆ మాట గ్రహించి యశోకవతి శ్రమణి చేయిపట్టుకొని చాటునకుం దీసికొనిపోయి నే నశోకవతిని, నీవు శ్రమణివని తలంచితిని. నా వలెనే నీవు పురుషవేషము వైచితివి. రాజవాహనునివలె నుంటివి. నేను జ్ఞాపకముంటినా? యని యడిగిన శ్రమణి వెఱఁగుపాటుతో నిట్లనియె.

ఆహా! ఏమి ఈ చిత్రము? నీ వశోకవతివా! తల్లీ! పురుషవేషము వైచితి వేమిటికి? మాయన్నం దీసికొనిపోయి చెరసాలం బెట్టించితివా? చాలు చాలు మంచి యుపకారమే చేసితివి. అని యాక్షేపించుచుండ నశోకవతి సిగ్గుపడుచు నిట్లనియె.

అమ్మాణీ! నా చెప్పినమాటలు విని పిమ్మట నాక్షేపింపుము మీ యన్నగా రీచిలుకను బ్రశ్నముల నడిగి యుత్తరము వడయుటకై బదిదినము లిందుండవలసి వచ్చినది . నేను వెనుక రమ్మని పరిజనుల నియమించి యరిగితిని. మా రాజపుత్రిక యీతనిం జూచుటకై యాతురతతో వేచియుండి నితండు రాడయ్యె. నన్ను మరలఁ బంపినది. అతండు దారి తప్పి జయపురంబున కరిగి గుఱ్ఱము దిగని కారణంబునఁ జెఱసాలం బెట్టఁబడియెనఁట. అందులకే విశ్వప్రయత్నముఁ జేయుచున్నాను. ఆదిత్యవర్మయను నీ బ్రాహ్మణుఁడు మహాబలశాలి. వాని విడిపించుటకై యితని నాశ్రయించు చుంటిని. ఇతండు మహారాష్ట్ర దేశాధిపతి పంపున మృగంబులకై మీ యింటికి వచ్చుచుండఁ గలిసికొంటిని. మేము మీ యింటికిం బోయితిమి. మీ యింట నెవ్వరునులేరు. పరిజనుల నడుగ నిట్లు జెప్పిరి. దుందుభికుమారుంజజు తండ్రికిఁ జెప్పకుండ నడివికి వేటకుఁ బోయెను. అతనిజాడఁ తెలిసికొన దుందుభి యరణ్యమున కరిగెను. అతఁ