పుట:కాశీమజిలీకథలు -09.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

డెన్నిదినములకు రాకున్నఁ గూఁతురు శ్రమణి యడిగినది. తద్వియోగదుఃఖంబు భరింపఁ జాలక తల్లి పరిజనులం దీసికొని మొన్ననే యీ ప్రాంతరాంతారములకుఁ జనినది. వారు వచ్చువరకు మృగముల నమ్మువారు లేరు.

అని చెప్పుటయు మేమా మాటలు విని రాజవాహనుఁడు జయపురంబున శత్రువులచేఁ బట్టుబడియెను. దుందుభి వచ్చి తరువాత నీ వార్తఁ జెప్పుడు. అని చీటి వ్రాసి యిచ్చి మే మిద్దరము బయలుదేరి వచ్చుచుఁ జిలుకనేతృత్వముఁ దెలిసికొనుటకై యీతండు కోరిన నిట్లు వచ్చితిమి. నీవు గనంబడితివి. అతం డెవ్వఁడు? నీవిందేమిటికి వచ్చితివని యడిగిన శ్రమణి యిట్లనియె.

నేను నీ మొదటివార్తవిని మా తల్లికిం జెప్పకుండఁ బురుషవేషము వైచికొని వచ్చుచు దారిలో శ్యామలాపురంబున కరిగితిని. నన్ను రాజవాహనుఁ డనుకొని తత్పట్టణ ప్రజలు, రాజు, రాజపుత్రిక చాలగౌరవించి యూరేగించిరి. వారికి నేను తదనుజుండవని చెప్పితిని. కాని చెఱసాల వృత్తాంతము విని పరితపించుచు నందరుం గలసివచ్చి సహాయముచేయుదు మని చెప్పిరి. ముందు కార్యావసర ముంచి వర్తమానముఁ జేయుదునని యటఁ గదలి యీ చిలుకయొద్దకు వచ్చి శకున మడిగితిని. మీ యన్న నిన్ననే విముక్తుండయ్యెనని వ్రాసినది. అది యెంత సత్యమో తెలియదు. ఈతండు దుర్గానగరాధీశ్వరుని కుమారుఁడు సునందు డనువాఁడు. మా యన్నకు మిత్రుఁడు. ఇందే కలసికొంటిమి. మా యన్న చెఱవిడిపించుటకై నాతో బయలుదేరి వచ్చుచున్నాడు. ఇంతలో మీరు వచ్చితిరి. ఇదియే నా వృత్తాంతము. ఆ బ్రాహ్మణుఁడు మహా బలశాలి యంటివి. ఎట్టి బలముగల వాఁడు చెప్పుమనపుఁడు అశోకవతి యిట్లనియె.

అతం డసహాయశూరుఁడు. దేవతాంశాసంభూతుఁడు. ఇతఁడు పూర్వం జయపుర భర్తయగు విజయపాలుఁడను నృపాలునొద్ద మంత్రిగాఁ బ్రవేశించి యతనిం గాపాడుచుండెను. ఆ రా జితని సుమతియని పిలుచువాఁడట. ఈ మధువర్మ యతం డుండినప్పు డనేకమాయోపాయములు పన్ని విజయపాలుని చంపవలయునని ప్రయత్నము జేసెనఁట. సాగినదికాదు దైవికముగా నితని రూపము చూచి విజయపాలుని భార్య మోహించి కామించినదఁట. ఇతఁ డందు బడలేదు. అప్పుడు భర్తకు లేనిపోని నేరములు చెప్పి యితని లేవగొట్టినదఁట. .....మధువర్మ మందపాలుఁడను నృపాలుని సహాయము దీసికొని యాదుర్గము స్వాధీనము చేసికొని యారాజదంపతులఁ గడతేర్చెనఁట. అని యతని వృత్తాంత మంతయు చెప్పుటయు వేఁగుపాటుతో శ్రమణి యిట్లనియె.

ఏమీ! మాసుమతియా! గంగపట్టణ సుమతియా! అని విస్మయమందుచుండ నశోకవతి ఆసుమతియన నేసుమతి?

నీ వెట్లెఱుంగుదువు? అనవుడు సరిసరి ఇప్పుడు నీవు చెప్పిన చరిత్ర