పుట:కాశీమజిలీకథలు -09.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

యేమి చెప్పినది? అని పలుకుటయు శ్రమణి సంతసముతో వాకిటకు వచ్చి యిట్లనియె.

మీకు సంతతము మహిళాంగిమీఁద బుద్ధి యుండుటచే నా మాటయే వచ్చినది. రండు రండు. ఇదిగో చిలుక యిచ్చిన యుత్తరము. మీ రనినట్లు జ్ఞానహీనమగు పక్షికి సత్యమేమి తెలియును? అని పలుకుచుఁ దన పత్రిక చూపినది.

అతం డది చదివికొని యోహో! అన్నింటికంటె నిన్నుఁ బురుషుఁడు కాఁడనుచున్నది. ఇంతకన్న నవివేక మేమియున్నది? మీ యన్నకు వ్రాసినట్లే కులముపై గీటు పెట్టినది. దాని కేమి? కలలోనైన దీనిమాటను నమ్మగూడదు. మగవారి నాఁడువారిగా చెప్పిన నెవ్వరు నమ్ముదురు? నీవు కోపము సేయవేని యొక్క మాట సెప్పెద వినియెదవా?

శ్రమ - అడుగవలసినమాట యేదియో అడుగుడు. నాకేల కోపము?

సునం - నిన్నుఁ బరీక్షించినచోఁ జిలుకమాటలయందుఁ గల నిజానిజంబు లిప్పుడే తేలగలవు.

శ్రమ - నన్నేమి పరీక్షింతురు ?

సునం - చిలుక నిన్నుఁ గలికి యన్నదిగదా? ఆ విషయమై.

శ్రమ - అదియా? గడుసువారలే? స్త్రీనైన నేమిచేయుదురు ?

సునం - చిలుక యేమన్న దో, అదియే.

శ్రమ - ఏమన్నది నన్నుఁ బురుషుఁడు కాదన్నది యేనా?

సునం - అదికాదు. నన్ను గఱించి యిచ్చిన ప్రశ్నములలో.

శ్రమ - నీ భార్య యిక్కడనే యున్నదన్నది. అదియేనాఁ

సునం - అగు నగు.

శ్రమ - నేను స్త్రీనైనచో నన్ను భార్యగా జేసికొందువా?

సుసం--ఆ మాటయు నీమాటయు దెఱుకయే చెప్పినదిగదా ?

అని పలుకుచు అతను మదనత్వమంద నీవు పురుషుండవో, మగువవో నీ మొగమే చెప్పుచున్నది. నేనంత యెఱుంగనివాడ ననుకొంటివా?చూడుమని యామె యంగీలఁ బట్టుకొని మరుగు పడుచుండఁ దిగిచి పారవైచె. నప్పుడు—

చ. కులుకు మిటారి గబ్బిచనుగుత్తులపొత్తు బయల్పడన్ బళా
      బళ! యనుచు దటాలున నెపంబిడి చేతులఁ గప్పినప్పు డ
      క్కలికి సునందుఁడు బిగియఁ గౌఁగిటఁ జేర్చి వధూటి తళ్కు చె
      క్కుల వెస ముద్దు పెట్టుకొనె గోమలి గొంకక సిగ్గు పెంపునన్.

అప్పు డప్పడఁతి వాని రెండుచేతులుం బట్టి మోము ముద్దలాడుచు మనోహరా! నీవే నాభర్తవు నీకు నేను భార్యను. ఇది దైవఘటితంబు. ఇప్పుడు తొందర