పుట:కాశీమజిలీకథలు -09.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుందుభి కథ

11

ప్రభృతి విచిత్రపతత్రంబుఁ జంపకుండఁ బట్టికొని బోనులం బెట్టించుచుండెను. అదియునుంగాక,

సీ. ఎఱవట్టి తిరుగు కేసరినయిన నట లూని
                  మోము నే లంటంగఁ బ్రామగలఁడు
    మదమెక్కి కడిమిఁ గ్రుమ్మరు మహాకరినైనఁ
                  దెగువ దంతముపట్టి తిగయఁగలఁడు
    కడుదెబ్బ దిని బొబ్బలిడు బెబ్బులి మొగానఁ
                 గరమిడినేలఁ ద్రొక్కంగఁగలఁడు
    పరుగుడు శరభంబు దరిమి యడ్డము వచ్చి
                గోళ్ళఁ బట్టి విదల్చి కూల్చఁగలఁడు

గీ. ననగఁ దక్కిన సత్వసంతతులు వాని
    భుజబలంబున కెంత నభోగములను
    గూతలిడి చెంతకరుదేరఁ జేతబట్టి
    దుందుభి బకాసిఁదొంటి దుందుభి యనంగ

అక్కిరాతపతి యట్లు బహువిధమృగంబుల విచిత్రపతత్రంబులఁ జంపకుండఁ బట్టికొని బోనులం బెట్టించి యింటికిం దీసికొనిపోయి యాటపాటల నేర్పి మహారాజులకును నాటకాండ్రకును నామృగాదుల నమ్మి బహుధనం బార్జించుచుండెను. ఆశ్రమమృగంబులవలె నందలి మృగాదులు దుందుభి శిక్షణంబునం జేసి యన్యోన్యవైరంబులు విడిచి మైత్రితో మెలంగుచుండునవి.

వానియింటి కెటుచూచినను నాలుగు యోజనములవరకు మహారణ్యమే కాని తెరపిలేదు. అయ్యడవిలో గుఱ్ఱములు నెద్దులు తప్ప బండ్లు మొదలగు యానములు నడువవు. అట్లయినను నానాదేశములనుండి మృగంబులఁ బక్షులఁ గొనుటకై మహారాజప్రేషితులగు పరిజనులు నాటగాండ్రును వాని యింటికి సంతతము వచ్చుచుం బోవుచుందురు.

అందు నేనుఁగులకు గుఱ్ఱములకు మృగములకు పసులకు విశాలముగా వేరువేర శాలలు నిర్మింపబడి యున్నవి. వాని పరిజనులు సంతతము మృగముల కాటపాటలు నేర్పుచుందురు. వానిమందిరము మహరాజు మందిరముకన్న సుందరమై యున్నది.

వానికుమారుఁడు రాజవాహనుఁడు, కూఁతురు శ్రమణియుఁ బ్రాయంబున రెండేడులు వైషమ్యము గలవారయినను జూచువారికిఁ గవలపిల్లలని తోచకమానదు. వారి సౌందర్యము వర్ణనాతీతమై యున్నది. కిరాతకంబులనేకాక మహారాజవంశంబులం గూడ భూమండలంబున నట్టిచక్కనిబిడ్డలు పుట్టలేదని చెప్పుట యతిశయోక్తిగాదు.

రాజవాహనుఁడు చెల్లెలితోఁగూడ గజాశ్వారోహణమునందు, వ్యాయామము