పుట:కాశీమజిలీకథలు -09.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిత్యవర్మ కథ

53

నోపరివ్రాజక! నేను యక్షకన్యకను. వీరందరు నా సఖురాండ్రు. నీ తపంబునకుఁ గట్టుబడి వచ్చితిమి. వీరిలో నీకుఁ గావలసిన కన్యక నేరికొనుము. నీకు వశవర్తినియై భార్యగానుండి నిత్యము నైదుమాడల దీసికొనివచ్చి నీకిచ్చుచుండునని చెప్పిన విని యా పరివ్రాజకుఁడు సంతసించుచు వారిలోఁ దనకు నచ్చిన మచ్చెకంటి నొకదాని నేరికొని భార్యగాఁ జేసికొనియెను. ఆకాంత నిత్యము రాత్రుల నేకాంతముగా వచ్చి యైదు మాడలు వాని కిచ్చి యభీష్ట కామంబుల వానిఁ దృప్తిపరచి యేగుచుండెను.

భాస్కరవర్మ పరివ్రాజకుని మంత్రసిద్ధిఁ దెలిసికొని మిక్కిలి యుత్సుకముతోఁ దన కామంత్ర ముపదేశింపుమని యా సన్యాసిం బ్రార్థించెను. అతఁ డొకశుభదివసంబున యధావిధి ప్రయోగముగా నా మంత్రము భాస్కరవర్మ కుపదేశము గావించెను.

భాస్కరవర్మ పరివ్రాజకుని మంత్రసిద్దిఁ దెలిసికొని మిక్కిలిశ్రద్ధతో నా మంత్రము జపించుచుండెను. అచిరకాలములో నా యక్షిణి భాస్కరవర్మకు సహస్రయక్షకన్యాపరివృతయై ప్రత్యక్షమై నీ యభీష్టముఁ దెలుపు మనవుఁడు నీవే నాకు భార్యగా నుండుమని కోరికొనియెను. ఆ జవ్వని నవ్వుచు నిదివఱ కెవ్వరు నన్నుఁ గోఱలేదు. నేను సులభసాధ్యను గాను. ఆరునెలలు నీవు బ్రహ్మచర్యవ్రతం బొనరింపవలయును. అందుఁ గృతార్థుఁడవు కాకపోవుదువేని నీవు సర్వభ్రష్టుండ వగుదువు. కృతకృత్యుఁడ వైతివేని నీకు భార్యఁ గాగలను. ఇంతయేల వచ్చె? వీరిలో నీయిచ్చవచ్చిన చిగురాఁకుబోఁడిఁ గోరుకొనుము. సుఖింతువుగాక యని పలికిన నతండు నే నితరులఁ గోర నీవే భార్యగావలయు. నన్ను నీ యిష్టమువచ్చిన నియమంబులఁ బరీక్షింపుము. కృతార్థుండ నైనప్పుడే యంగీకరింపుమని పలికిన విని యాకలికి సంతసించుచు నాతని నప్పుడే యలకాపురంబునకుఁ దీసికొని పోయినది.

యక్షస్త్రీసహస్రమధ్యంబున విడిచి యారుమాసములు పరీక్షించినది. అతనిబుద్ధి యించుకయు జలింపలేదు. అసిధారావ్రతముగా నతం డాస్త్రీమండలమధ్యంబున సంచరించెను. తన్నియమమునకు మెప్పుఁ జెంది యాయక్షిణీకాంత యతనిం బెండ్లి యాడినది. భాస్కరవర్మ యలకాపురమున యక్షకాంతతో నభీష్టసుఖంబు లనుభవింపుచుండెను.

ఆ దంపతులకు నేను బుత్రుండనై యుదయించితిని. నే నాయలకాపుర మందే మణిధరుండను యక్షునివలన సమస్తవిద్యలు నేర్చుకొంటిని. ఎట్టివారికిని పురాకృతము లనుభవింపక తీరవుగదా? ఒకనాఁడు మహేంద్రుఁ డేదోయుత్సవమున యలకాపురంబునకు వచ్చుటయుఁ గుబేరుఁ డతనికి గొప్ప విందుఁ గావించెను. అం దొకగానసభయందుఁ జూచియో, చూడకయో దేవేంద్రుఁడు వచ్చినప్పుడు మా తండ్రిగారు లేవలేదఁట.

దేవేంద్రునికిఁ జాలకోపము వచ్చినది. కుబేరునిం జీరి వీఁడెవ్వఁడు?