పుట:కాశీమజిలీకథలు -09.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మీయొద్ద నిజము దాచనేల . మా రాజపుత్రిక వాని చిత్రఫలకమును చూచి వరించినది.

ఈ యుపద్రవము విని నిద్రాహారములు లేక పరితపించుచున్నది. నన్నందుఁ బోయి యా పుళిందకుమారుని స్థితిగతు లెట్లున్నవియో విమర్శించి రమ్మన్నది అందులకై పురుషవేషము వైచికొని నేనందుఁ బోవుచున్నాను. మీరు మహాపండితులు గనుక తెలిసికొంటిరి. మీరా పుళిందుని కడకరుచుగచున్నారు. కావున నీ వార్త వానికిఁ దెలియజేయుఁడు. ఇదివర కొకవర్తమానము పంపియుంటిమి. అని తన వృత్తాంతమంతయు నెఱింగించిన విని యా యాదిత్యవర్మ తలయూచుచు నిట్లనియె.

ఆశోకవతీ! నేనా జయపురములోఁ గొన్ని నాళ్ళుంటి. మధువర్మ మందపాలుర నెఱుంగదు. వారు కడుక్రూరులు నీ వందుఁబోయి యేమి జేయఁగలవు? ఒంటరిగాఁ బోయితివేని నిన్నుఁగూడఁ బట్టికొందురు మీరాజుతోఁ జెప్పి తగుప్రయత్నముతోఁ బోవవలయునని చెప్పిన నప్పడతి స్వామీ! మీరానగరమున నేమిటికి వసించితిరి? ఆ రాజుల నెట్లెఱుఁగుదురు? మీ వృత్తాంతముఁ జెప్పి నా కానందముఁ గలుగఁ జేయుఁడని వేడిన నా బ్రాహ్మణుం డిట్లనియె.

తరుణీ! నాకథ నడుగుచుంటివి గనుక జెప్పెద వినుము. ఉజ్జయినీపురంబున భాస్కరవర్మయను బాహ్మణుఁడు గలఁడు. అతనికిఁ జిన్నతనమునందే తలిదండ్రులు గతించిరి. మేనమామగారియింట పెరుగుచుండెను. అతండు క్రమంబున వేదవేదాంగములఁ జదివి మహావిద్వాంసుఁడని ప్రఖ్యాతి వడసెను. ఆ పండితునికి దైవికముగా నొక పరివ్రాజికునితో సహవాసము గలిగినది. ఆ సన్యాసి నిత్యము శ్మసానభూమిలో వసించి యక్షిణీసిద్ధికై జపముఁ జేసికొనుచుండును. భాస్కరవర్మయుఁ దరుచు వానియొద్దకుఁ బోవుచుండును. ఒకనాఁడు అతనిం జూచి మిత్రమా! నీ వీవల్లకాట వసించి సంతతము జపింతువు. ఇందులకు ఫలమేమి? దేనిగుఱించి యీ శ్రమ పడుచుంటివని యడిగిన నతం డిట్లనియె.

విద్వాంసుఁడా! నేనొక యక్షిణీదేవత నారాధించుచుంటిని. అందుల కీ భూమి కడుపవిత్రమైనది. ఆ మంత్రము సిద్ధించెనేని జన్మసాద్గుణ్యము నొందఁగలదు. యక్షిణి ప్రత్యక్షమై యభీష్టకామంబుల దీర్పగలదని యాకల్పవిధానమంతయు నెఱింగించెను. అప్పుడు భాస్కరవర్మ వయస్యా! ఆ మంత్రము నాకుఁగూడ నుపదేశముఁ గావింపుము. నేనుగూడ జపించెదనని యడిగిన నతండు నా మంత్రసిద్ది చూచిన పిమ్మట నీ కుపదేశించెదఁ బదిదినములలో యక్షిణి ప్రత్యక్షముకాక తప్పదని చెప్పుటయు భాస్కరవర్మ యాసిద్ధి ప్రకార మరయుచు వాని నాశ్రయించుచుండెను.

మఱికొన్నిదినములకు నొకదేవకన్యక దివ్యస్త్రీసహస్రపరివృతయై విమాన మెక్కివచ్చి యాపరివ్రాజకు నెదుర నిలువఁబడి మధురగంభీరస్వరముతో